శ్రుతిహాసన్ తన పెదవులు, ముక్కు అందాన్ని మెరుగుపరుచుకునేందుకు కాస్మోటిక్ సర్జరీ చేయించుకుందని ఇంతకుముందు కథనాలొచ్చాయి. ఈమె ముఖం సర్జరీల దుకాణం! అని విమర్శించారు. ఇదే విషయాన్ని శ్రుతిహాసన్ తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది.
సర్జరీల గురించి లేదా ప్రేమ వ్యవహారాల గురించి, ఇతర వ్యక్తిగత విషయాలపైనా నిజాయితీగా మాట్లాడితే దాని పర్యవసానం ఇలానే ఉంటుంది. ఎదుటివారు కించపరుస్తూ మాట్లాడుతారని శ్రుతిహాసన్ వాపోయింది. అయితే ఎవరో ఏదో అనుకుంటారని నేను నా వైఖరిని మార్చుకోలేను. నాకు నచ్చిన విధంగానే ఉంటానని శ్రుతి తెగేసి చెప్పేసింది.
శ్రుతి దక్షిణాది వర్క్ కల్చర్‌తో పోలిస్తే ఉత్తరాది వర్క్ కల్చర్ ఎలా ఉంటుందో కూడా వివరించింది. దక్షిణాదిన వినయంగా గౌరవంగా ఉంటారు. సంస్కృతి సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తారు. నియమం ప్రకారం సెట్లో వ్యవహరిస్తారు. కానీ బాలీవుడ్ లో అలాంటివి చూడలేదని శ్రుతిహాసన్ అన్నారు. పూజలు పునస్కారాలు, కొబ్బరికాయ కొట్టి సినిమాల ప్రారంభోత్సవాలు చేయడం వంటివి దక్షిణాదిన మాత్రమే చూసానని అన్నారు.
అందాల కథానాయిక శ్రుతిహాసన్ తొలుత విదేశీ బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలే నుంచి విడిపోయిన తర్వాత డూడుల్ ఆర్టిస్టు శంతను హజారికతో ప్రేమాయణం నడిపించింది. ఆ తర్వాత అతడి నుంచి కూడా బ్రేకప్ అయ్యింది. ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్న ఈ బ్యూటీ కెరీర్ పైనే దృష్టి సారించింది.




BB 9: ఈ వారం నామినేషన్స్ లిస్ట్ లీక్ 

Loading..