Advertisementt

బిగ్ బాస్ బజ్: రమ్య పొగరు దించేసిన శివాజీ

Mon 27th Oct 2025 09:29 AM
shivaji  బిగ్ బాస్ బజ్: రమ్య పొగరు దించేసిన శివాజీ
Bigg Boss Buzzz: Shivaji vs Ramya బిగ్ బాస్ బజ్: రమ్య పొగరు దించేసిన శివాజీ
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు గా ఎంటర్ అయిన పచ్చళ్ళ పాప రమ్య మోక్ష తన యాటిట్యూడ్ తో బ్యాక్ బిచ్చింగ్ తో, మానిప్యులేటర్ గా రెండు వారాలకే బయటికొచ్చేసింది. హౌస్ లో అదే పనిగా తనూజ ను టార్గెట్ చేసి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ సుమన్ శెట్టి, ఇమ్మాన్యువల్ తో ఫ్రెండ్ షిప్ చేసి, తనూజ పై నోరు పారేసుకున్న రమ్య ను ఆడియన్స్ తొందరగానే ఇంటికి పంపేశారు. 

బిగ్ బాస్ లోపల ఎలా ఉన్నా బయటికొచ్చాక బిగ్ బాస్ బజ్ లో హోస్ట్ శివాజీ రమ్య మోక్ష పొగరు దించేశారు. నువ్వు హౌస్ లోకి ఎందుకెళ్లావ్ నెగిటివిటీ పోగొట్టుకోవడానికి వెళ్ళాను అన్నావ్, మరి లోపల నువ్వేం చేసావ్ అని అడిగారు. నాకు బిగ్ బాస్ లవర్స్ పార్క్ లా అనిపించింది. తనూజ-కళ్యాణ్, రీతూ-పవన్ మధ్యన బాండింగ్ బ్రేక్ చెయ్యాలనే వెళ్ళాను. నాకు తనూజ నచ్చలేదు. ఆమె వల్ల కళ్యాణ్ బ్యాడ్ అవుతున్నాడు అంది రమ్య. 

అయినా తనూజ కి లేని దూల నీకెందుకు అన్నారు శివాజీ. పవన్-రీతూ, తనూజ-కళ్యాణ్ లను వేరు చెయ్యాలనే మీరు హౌస్ లోకి వెళ్లారు అని శివాజీ అంటే.. నేను బాండ్స్ బ్రేక్ చేయాలనుకున్నాను, నాకు కళ్యాణ్ చెయ్యి వేస్తె తనూజ  తోసెయ్యడం నచ్చలేదు నేను రియల్ గా చూసాను అంది. మరి నువ్వెందుకు పవన్ తో పులిహోర కలిపావ్ అంటూ వీడియో వేసి చూపించగానే రమ్య మోక్ష బిక్కమొహం వేసింది. 

బిగ్ బాస్ లో ఏం నేర్చుకున్నావు అని అంటే.. బిగ్ బాస్ కి వెళ్లి ఎవ్వరిని నమ్మకూడదు అని ఫిక్స్ అయ్యాను అంది రమ్య. మాధురి నాకు ఫేక్ గా అనిపించింది రమ్యతో.. బంధాలు విడగొట్టేస్తాను అన్న నువ్వు మరి మాధురి తో ఎందుకు ఫ్రెండ్ అయ్యి ఆమెనుబ్లేమ్  చేసావ్ అంటూ హోస్ట్ శివాజీ రమ్యను అడుగడుగునా మొహం మాడేలాంటి ప్రశ్నలతో ఏడిపించి వదిలేసారు. 

Bigg Boss Buzzz: Shivaji vs Ramya:

Bigg Boss Buzzz - Ramya Moksha Interview

Tags:   SHIVAJI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ