బిగ్ బాస్ సీజన్ 9 లో బాండింగ్స్ తో తనూజ సింపతీ గేమ్ ఆడుతుంది, నాన్న నాన్నా అంటూ భరణి ఆట పాడు చేసింది. కళ్యాణ్ ని తన చుట్టూ తిప్పుకుంటుంది అంటూ వైల్డ్ కార్డు ఎంట్రీలు తనూజను పదే పదే టార్గెట్ చేస్తూ ఆమెను నామినేట్ చెయ్యడమే కాదు చాలా బాధపెట్టడంతో అటు కళ్యాణ్, ఇటు ఇమ్మాన్యువల్ కూడా ఆమెకు దూరమైపోయారు.
తనూజ నుంచి కళ్యాణ్ దూరం జరగడానికి కారణం రమ్య వీరిపై బ్యాక్ బిచ్చింగ్ చేసిన వీడియోస్ చూడడమే. ఇక కళ్యాణ్ నామినేషన్స్ లో తనూజ ను నామినేట్ చేస్తాను అన్న మాట ఇమ్మాన్యువల్ బయటపెట్టడంతో తనూజ బాగా హార్ట్ అయ్యింది. అయితే తనూజ కెప్టెన్సీ టాస్క్ లో కళ్ళు తిరిగిపడిపోయి డాక్టర్ రూమ్ కి వెళ్ళినప్పుడు కళ్యాణ్ వెక్కి వెక్కి ఏడ్చాడు.
తనూజ డాక్టర్ రూమ్ నుంచి వచ్ఛాక కళ్యాణ్ తనూజ దగ్గరకు వచ్చి నువ్వు త్వరగా కోలుకో అన్నాడు. నువ్వు ఎందుకు ఏడ్చవ్ రా అంటే నువ్వు కెప్టెన్సీ టాస్క్ ఓడిపోయావ్ అందుకే అన్నాడు. ఆతర్వాత తనూజ నిద్ర పోతుంటే నేను ఈ వారం సేవ్ అయితే నీకొకటి చెబుతాను అన్న మాట నాగార్జున కళ్యాణ్ సేవ్ అవ్వగానే అడిగారు.
ఈరోజు ఆదివారం ఎపిసోడ్ లో తనూజ సేవ్ అవ్వగానే నువ్వు తనూజ కి ఏదో చెబుతా అన్నావ్ కదా అంటూ నాగార్జున కళ్యాణ్ ని తనూజ ని టాస్క్ రూమ్ లో కి పిలిచి కళ్యాణ్ ని చెప్పమనగానే కళ్యాణ్ తనూజ కి సారీ చెప్పాడు. రెండు వారాలుగా నిన్ను బాధపెట్టాను అంటూ ఇకపై అలా చెయ్యను, నేను దేవుడిని బిగ్ బాస్ హౌస్ లో ఒక్కటే కోరుకున్నా తనూజ కి ఫీవర్ లో పాజిటివ్ రాకూడదు అని అంటూ కళ్యాణ్ తనూజాకి సారీ చెప్పగానే నాగ్ అమ్మ తనూజ నీకేమన్నా అర్థమైందా అని ఇంకా ఎమన్నా చెప్పాలా కళ్యాణ్ అని అడిగితే తనూజ వద్దు సార్ ఇంకేం వద్దు అంటూ అవాయిడ్ చెయ్యడం ఈ ఎపిసోడ్ లో హైలెట్ అయ్యింది.




47000 మంది అమ్మాయిలతో అరాచకం
Loading..