స్పై యూనివర్శ్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలని యష్ రాజ్ ఫిలింస్ భావిస్తోంది. సల్మాన్, షారూఖ్, హృతిక్ లాంటి దిగ్గజ హీరోలతో ఇప్పటికే వైఆర్ఎఫ్ స్పై యూనివర్శ్ లో వరుస చిత్రాలను నిర్మిస్తూ భారీ విజయాలను అందుకుంటోంది. అయితే యూనివర్శ్ లో టైగర్ 3, వార్ 2 ఫలితాలు ఊహించనివి. ఈ రెండు చిత్రాలు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. ముఖ్యంగా వార్ 2 బ్యాడ్ రిజల్ట్ కి అయాన్ ముఖర్జీ అపరిపక్వ స్క్రీన్ ప్లే కారణమైంది.
ఇదిలా ఉంటే, ఆల్ఫాపైనా వార్ 2 ఫలితం ప్రభావం చూపుతోందని సమాచారం. నిజానికి ఆల్ఫాలో కబీర్ (హృతిక్ ) పాత్ర అతిథిగా ప్రవేశిస్తుందని ఇంతకుముందు నిర్మాత ఆదిత్య చోప్రా ప్రకటించారు. కానీ ఇప్పుడు వార్ 2 డిజాస్టర్ ఫలితం తర్వాత ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలిసింది. తాజా సమాచారం మేరకు... ఆల్ఫాలో అతిథిగా పఠాన్ (షారూఖ్ ఖాన్) ప్రవేశించేందుకు అవకాశం ఉందని తెలిసింది. షారూఖ్ లేదా సల్మాన్ ఇద్దరిలో ఎవరో ఒకరు లేదా ఇద్దరూ కూడా ఆల్ఫాలో అతిథులుగా నటించేందుకు అవకాశం ఉందని సోర్స్ చెబుతోంది. ఇప్పటికే ఆదిత్య చోప్రా షారూఖ్ ని సంప్రదించారు.
కింగ్ షెడ్యూళ్ల మధ్యలోనే పది రోజుల కాల్షీట్లు ఇచ్చేందుకు ఖాన్ కూడా ప్రయత్నిస్తున్నారు. సల్మాన్ ప్రవేశంపై మరింత స్పష్ఠత రావాల్సి ఉంది. మరోవైపు ఆల్ఫాలో పఠాన్ 2 కోసం ఆదిత్య చోప్రా హింట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షారూఖ్ అతిథి పాత్రలో కనిపించినా అది పఠాన్ 2 కి లీడ్ తీసుకుంటుందని తెలిసింది. ఆల్ఫాలో ఆలియా భట్, శార్వరి వాఘ్ స్పై లుగా నటిస్తున్నారు. భారతదేశంలో తొలి లేడి స్పై సినిమాగా ఆల్ఫా రికార్డులకెక్కనుంది.




నారా రోహిత్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో బాలయ్య 
Loading..