Advertisementt

BB9: ఈ వారం డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు

Sat 25th Oct 2025 10:36 AM
bigg boss  BB9: ఈ వారం డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు
BB9: Three contestants in danger zone BB9: ఈ వారం డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 9 లో గత వారం టాప్ కంటెస్టెంట్ భరణి బంధాల కారణంగా బుల్లితెర ఆడియన్స్ ఇంటికి పంపించేశారు. ఆట తీరు, ఆయన ప్రవర్తన బాగున్నా తనూజ, దివ్య లతో ఆయన ఫాదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వక ఎలిమినేట్ అయ్యారు. అది హౌస్ మేట్స్ అందరికి షాకిచ్చింది. ఇక ఈ వారం ఎవరు వెళతారనే విషయంలో అందరిలో సందిగ్దత నెలకొంది. 

ఈ వారం నామినేషన్స్ లో ఉన్న తనూజ, కళ్యాణ్, రీతూ, రమ్య, దివ్య, సాయి, రాము రాధోడ్ లలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో అనే విషయంలో రోజుకో పేరు వినిపించింది. ఇక గత రాత్రి ఎపిసోడ్ లో అనారోగ్య కారణాలతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయేషా హౌస్ ని వీడింది. ఇక మరో టాప్ కంటెస్టెంట్ తనూజ కళ్ళు తిరిగిపడిపోవడం ఇమ్మాన్యువల్, కళ్యాణ్ లను బాధపెట్టింది. 

అయితే ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారంటే.. ఈ వారం ఓటింగ్ లో తనూజ దుమ్మురేపి టాప్ ప్లేస్ లో ఉంటే.. కళ్యాణ్ పగడాల తనూజాకి ఈ వారం గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో ఉన్నాడు. ఎక్కడ ఎలిమినేట్ అవుతానో అని భయపడుతున్న సంజన మూడో ప్లేస్ లో కొనసాగింది. ఇక ఆ తర్వాత స్థానాల్లో దివ్య, రీతూ చౌదరి ఉన్నారు. 

ఈ వారం డేంజర్ జోన్ లో రమ్య మోక్ష, రాము రాధోడ్, సాయి ఉన్నారు. ఈ ముగ్గురిలో లీస్ట్ ఓట్స్ సాయి కి పడుతున్నాయి. మరి ఈ వారం ఈముగ్గురు లో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనేది ఈరోజు నైట్ కల్లా బిగ్ బాస్ లీకులతో బయటికొచ్చేస్తుంది. 

BB9: Three contestants in danger zone:

Bigg Boss Telugu 9: Sai is in the danger zone

Tags:   BIGG BOSS
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ