Advertisementt

అఖండ 2: సౌండ్ కంట్రోల్లో పెట్టుకో..

Fri 24th Oct 2025 05:30 PM
akhanda 2  అఖండ 2: సౌండ్ కంట్రోల్లో పెట్టుకో..
Akhanda 2 blasting roar unleashes fury అఖండ 2: సౌండ్ కంట్రోల్లో పెట్టుకో..
Advertisement
Ads by CJ

అఖండ 2 తాండవం డిసెంబర్ 5 న రిలీజ్ కి రెడీ అవుతుంది. పవర్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి.. క్రేజీ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ కాంబో అంటే ఫైర్. అభిమానులకు మాస్ జాతర. ఇప్పటికే అఖండ తాండవం నుంచి వచ్చిన అఘోర కేరెక్టర్ టీజర్ చూసి మాస్ ఆడియన్స్ విజిల్స్ వేశారు. బాలయ్య అఖండ లుక్ వేరే లెవల్ అని సంబరపడ్డారు. 

ఇప్పుడు అఖండ 2 బ్లాస్టింగ్ రోవర్ అంటూ అఖండ తాండవంలో బాలయ్య సెకండ్ కేరెక్టర్ ను పవర్ ఫుల్ గా రివీల్ చేసారు. యాక్షన్ మోడ్ లో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించ్చింది. సౌండ్ కంట్రోల్ పెట్టుకో.. ఏ సౌండ్ కి నవ్వుతానో, ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు కొడకా అంటూ చెప్పిన డైలాగ్ ఈ బ్లాస్టింగ్ రోయర్ లో హైలెట్.. కాదు కాదు విజిల్స్ వేయించే డైలాగ్ అది. 

మరి అఘోర కేరెక్టర్ మాత్రమే కాదు అఖండ 2 లో సెకండ్ బాలయ్య పాత్ర కూడా ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుంది అనేది బోయపాటి బ్లాస్టింగ్ రోవర్ ద్వారా జస్ట్ శాంపిల్ వదిలారు, థమన్ యాజ్యుజ్వల్ గా BGM ఇరగదీసేసాడు. ఇక సినిమాటోగ్రఫీ ఈ అఖండ 2 బ్లాస్టింగ్ రోవర్  లో మరింత హైలెట్. బోయపాటి మేకింగ్ స్టయిల్ గురించి ఏం చెప్పాలి. మాస్ ఆడియన్స్ కు, నందమూరి అభిమానులకు అఖండ 2 మాస్ ఫీస్ట్ ఈ బ్లాస్టింగ్ రోయర్. 

Akhanda 2 blasting roar unleashes fury:

Akhanda Thaandavam - Balakrishna blasting roar

Tags:   AKHANDA 2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ