బ్రహ్మాస్త లాంటి యావరేజ్ మూవీని తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ `వార్ 2` లాంటి డిజాస్టర్ ని కూడా తెరకెక్కించాడు. భారీ విజువల్ గ్రాఫిక్స్ కారణంగా బ్రహ్మాస్త్ర కాస్ట్ ఫెయిల్యూర్ గా మారింది. ఇక వార్ 2 గ్రాఫిక్స్ సెట్ కాక, అయాన్ ముఖర్జీ విజన్ ఎవరికీ నచ్చక తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. క్రిటిక్స్ ఈ సినిమా మేకింగ్ ని తప్పు పట్టారు.
అయితే `వార్ 2` ఫెయిల్యూర్ ప్రభావం అతడి తదుపరి సినిమాపై పడింది. నిజానికి యష్ రాజ్ ఫిలింస్ రూపొందించనున్న ధూమ్ 4కి దర్శకుడిగా అయాన్ ముఖర్జీ ఎంపికయ్యారు. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి అయాన్ తప్పుకున్నట్టు తెలిసింది. నిర్మాత ఆదిత్య చోప్రా, హీరో రణబీర్ లతో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అయాన్ ముఖర్జీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. అయితే ఆ ఇద్దరి తో తన స్నేహం యథావిధిగా కొనసాగుతుందని కూడా తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్ నుంచి అయాన్ ముఖర్జీ తప్పుకోవడానికి కారణం యాక్షన్ సినిమాలు తనకు నచ్చే జానర్ కాదు. తాను శుధ్ దేశీ తరహా రొమాంటిక్ డ్రామాలను రూపొందించేందుకు ఎక్కువ ఆసక్తిగా ఉంటాడు. కానీ వార్ 2 ఆఫర్ చేసినప్పుడు అయాన్ ముఖర్జీ దానిని కాదనలేకపోయాడని కొంత స్పష్ఠత వచ్చింది. ధూమ్ 4 స్క్రిప్ట్ ని శ్రీరామ్ రాఘవన్ రూపొందించారు. అయితే ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఇప్పటికి సస్పెన్స్. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సౌత్ హీరో నటిస్తారా లేదా? అన్నది కూడా ఇప్పటికి సస్పెన్స్.




నారీ నారీ నడుమ యూట్యూబర్

Loading..