పెళ్లయిన పదకొండేళ్లకు మెగా స్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన గుడ్ న్యూస్ చెప్పింది. రెండేళ్ల క్రితమే రామ్ చరణ్-ఉపాసన లు మెగా ఫ్యామిలీ కి క్లింకార రూపంలో ఆనందాన్ని తెచ్చిపెట్టారు. మెగాస్టార్ చిరు తాతయ్యయ్యారు. రామ్ చరణ్-ఉపాసనలు ప్రౌడ్ పేరెంట్స్ అయ్యారు. అయితే క్లింకార జన్మించి రెండేళ్లయినా ఇప్పటివరకు మెగా మనవరాలి ఫేస్ రివీల్ అవ్వలేదు.
ఇంతలోపే రామ్ చరణ్-ఉపాసన దంపతులు మరో గుడ్ న్యూస్ వినిపించారు. ఉపాసన రెండో ప్రెగ్నెన్సీని మెగా ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటూ ప్రకటించారు. మెగా ఫ్యామిలిలో మరోసారి సంతోషం వెల్లువిరిసంది. ఉపాసనకు అత్తమామలు చిరు-సురేఖల ఆశీర్వదంతో పాటుగా ఉపాసన పేరెంట్స్ ఆశీర్వదాలు ఇచ్చారు.
ఈ వేడుకలో పవన్ భార్య అన్న కూడా కనిపించారు. ఇక ఉపాసన తోటి కోడలు లావణ్య త్రిపాఠిలు ఉపాసనకు బొట్టు పెట్టి మరీ శుభాకాంక్షలు తెలిపారు. మెగా డాటర్ నిహారిక అన్న రామ్ చరణ్ ను హగ్ చేసుకుని విషెస్ తెలియజేసింది. ఉపాసన ప్రెగ్నెన్సీని మెగా ఫ్యామిలీ ఎంతగా సెలెబ్రేట్ చేసుకుందో అనేది వీడియో ద్వారా మెగా ఫ్యాన్స్ కి షేర్ చేసారు.
దానితో రామ్ చరణ్-ఉపాసన దంపతులకు అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.




అఫీషియల్ : ఫౌజీ గా ప్రభాస్ లుక్ 

Loading..