Advertisementt

లోక స్ట్రయిట్ తెలుగు అయితే ఆడేది కాదు

Wed 22nd Oct 2025 02:18 PM
naga vamsi  లోక స్ట్రయిట్ తెలుగు అయితే ఆడేది కాదు
Naga Vamsi slams audiences: If Lokah was a straight లోక స్ట్రయిట్ తెలుగు అయితే ఆడేది కాదు
Advertisement
Ads by CJ

మలయాళంలో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా కళ్యాణి ప్రియదర్శి కీ రోల్ లో తెరకెక్కిన కొత్త లోక చాప్టర్ 1 మళయాళంలోనే కాదు ఆ సినిమా విడుదలైన ప్రతి భాషలోను బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కళ్యాణ్ ప్రియదర్శి సూపర్ వుమన్ గా కనిపించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ హిట్ చేసారు ఆడియన్స్. నిర్మాత నాగవంశీ కొత్త లోక తెలుగు హక్కులు తీసుకుని థియేటర్స్ లో విడుదల చేసారు. 

కొత్త లోక ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. జియో హాట్ స్టార్ నుంచి కొత్త లోక ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న సమయంలో నిర్మాత నాగవంశీ కొత్త లోక ని తెలుగులో తెరకెక్కిస్తే చూసేవారు కాదు అంటూ మాస్ జాతర ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

లోక చాప్టర్ 1 నేనే తెలుగు లో రిలీజ్ చేశాను. ఇప్పుడు ఈమాట వింటే నన్ను పచ్చి బూతులు తిడతారు మళ్లీ వీడియోలో. లోక ని తెలుగులో స్ట్రయిట్ గా తీస్తే అని నాగవంశీ అనగానే హీరో రవితేజ ఆడదు అన్నారు. తెలుగులో స్పాన్ లేదు, ఇలా లేదు, అలా లేదు.. ఇక్కడ ల్యాగ్ ఉంది, అక్కడ ల్యాగ్ ఉంది అంటూ మట్లాడేవారు. 

తెలుగు ఆడియన్స్, తెలుగు ఎలా అయిపోయాము అంటే.. ఒక ఆ చిన్న ఎడ్జ్ లో ఉన్నాము, ఏది ఎట్లా అనేస్తున్నారో తెలియడం లేదు. జనాలకు ఎప్పుడు ఏది నచ్చుద్దో తెలియదు అంటూ నాగవంశీ మాస్ జాతర ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.   

Naga Vamsi slams audiences: If Lokah was a straight:

Naga Vamsi says Lokah would not have worked in Telugu

Tags:   NAGA VAMSI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ