కోలీవుడ్ హీరో విశాల్ ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటూనే ఉంటాడు. రీసెంట్ గా తను నటిస్తున్న మకుటం దర్శకుడు రవి అరసు తో తగువు పడ్డాడు, విశాల్ కి దర్శకుడికి విభేదాలు తలెత్తగా విశాల్ మకుటం దర్శకత్వ బాధ్యతలను నెత్తికెత్తుకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.
ఇప్పుడు ఆ విషయాన్ని విశాల్ ఒప్పుకోవడమే కాదు ఇకపై ఆ సీక్రెట్ ని దాయలేను అని చెప్పేసాడు. ఈ దీపావళి సందర్భంగా మకుటం సెకండ్ లుక్ ని షేర్ చేస్తూ.. ఇకపై ఏది దాచి ప్రయోజనం లేదు. నేను మకుటం సినిమాకి డైరెక్షన్ చేస్తాను అని అస్సలు అనుకోలేదు. పరిస్థితుల కారణంగా దర్శకత్వంలోకి దిగాల్సి వచ్చింది. బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
అంతేకాని ఎవరి బలవంతము లేదు. డబ్బు పెట్టే నిర్మాతలను కాపాడాలి. కొన్నిసార్లు పర్ఫెక్ట్ గా అలోచించి నిర్ణయాలు తీసుకుని బాధ్యతలు స్వీకరించాలి. మనల్ని ఆదరించే ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టాలని తపనతోనే రీ-వర్క్ చేసి మకుటం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నా.. ఇది న్యూ జర్నీ అంటూ విశాల్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.