Advertisementt

150 కోట్ల యాడ్ లో శ్రీలీల

Fri 17th Oct 2025 03:02 PM
sreeleela  150 కోట్ల యాడ్ లో శ్రీలీల
Sreeleela Stars in India Costliest Ad 150 కోట్ల యాడ్ లో శ్రీలీల
Advertisement
Ads by CJ

శ్రీలీల క్రేజ్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి పాకుతుంది. సౌత్ లో శ్రీలీల కు ధమాకా హిట్ తప్ప మరొకటి లేదు, తమిళనాట శ్రీలీల నటించిన చిత్రం విడుదల కావాల్సి ఉంది. మరోపక్క శ్రీలీల మెల్లగా హిందీలో జెండా పాతేందుకు రెడీ అవుతుంది. కార్తీక్ ఆర్యన్ తో చేస్తున్న మూవీ విడుదల కాకుండానే ఆమెకు బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. 

ఇప్పుడు శ్రీలీల కు ఓ కాస్ట్లీ యాడ్ లో నటించే ఛాన్స్ దక్కింది. ఒకప్పుడు తమ బ్రాండ్స్ ని మార్కెటింగ్ చేసుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీ లు  కోట్లు ఖర్చు పెట్టి అయినా సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి యాడ్ షూట్స్ చేసేవారు. ఇప్పుడు క్రేజీ టాప్ డైరెక్టర్స్ ఇలాంటి యాడ్స్ ని డైరెక్ట్ చేస్తున్నారు. ఏడాదికో రెండేళ్లకో ఒక సినిమా చేస్తూ కోట్లు సంపాదించే హీరోలు, దర్శకులు పది రోజుల యాడ్ షూట్ కి భారీగా పారితోషికాలు అందుకుంటున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బ్రాండ్ వాల్యూ ఎలాంటిదో అందరికి తెలుసు. ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చెయ్యబోయే ఓ యాడ్ బడ్జెట్ ఏకంగా 150 కోట్లట. రణ్వీర్ సింగ్‌, శ్రీలీల, బాబీ డియోల్‌లు ముఖ్య పాత్రల్లో అట్లీ దర్శకత్వంలో ఒక భారీ యాడ్ షూట్ జరగబోతుందని తెలుస్తుంది. 

అది ఒక కమర్షియల్‌ యాడ్‌, అది కూడా రూ.150 కోట్లతో రూపొందుతున్న యాడ్‌ అని సమాచారం అందుతోంది. అయితే అది ఏ బ్రాండ్ కి సంబందించిన యాడ్, ఆ కంపెనీ పేరేమిటి అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఏది ఏమైనా 150 కోట్ల యాడ్ లో శ్రీలీల నటిస్తుంది అంటే ఆమె ఫ్యాన్స్ కి సర్ ప్రైజింగ్ విషయమే కదా. 

Sreeleela Stars in India Costliest Ad:

Ranveer Singh, Bobby Deol and Sreeleela to star in an ad worth Rs 150 crore

Tags:   SREELEELA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ