స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో ని ఆపేయాలని, లేదంటే మహిళా సంఘాలతో కలిసి ధర్నా చేస్తామంటూ కొంతమంది యువకులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.
గజ్వేల్ కు చెందిన కమ్మరి. శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్ లు బిగ్ బాస్ షో.. సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నది, బిగ్ బాస్ షో కు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో వాళ్లకు విలువ లేదు.. కుటుంబ విలువలు పాటించని వారిని బిగ్ బాస్ టీం ఎంచుకుంటున్నది.
షో నిర్వాహకులు సమాజం సిగ్గు పడే విధంగా బిగ్ బాస్ ని నిర్వహిస్తున్నారు. వెంటనే బిగ్ బాస్ షో ను నిలిపివేయాలి.. బిగ్ బాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.. లేకపోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తాము.. కర్ణాటక లో చేసిన విధంగా ఇక్కడ కూడా బ్యాన్ చెయ్యాలి..
హోస్ట్ నాగార్జున సమాజానికి ఉపయోగ పడే కార్యక్రమాలు చెయ్యాలి.. దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వారిని సెలక్ట్ చేసుకొని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అని యువకులు ప్రశ్నిస్తున్నారు.