పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సూపర్ హిట్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని కంప్లీట్ చెయ్యడమే కాదు.. దే కాల్ హిం ఓజి కి సీక్వెల్ చేస్తాను అని సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మాటిచ్చారు. సుజిత్, థమన్ లతో కలిసి కూర్చుని OG సీక్వెల్ పై ఆలోచిస్తామని చెప్పడంతో పవన్ కళ్యాణ్ లైనప్ పై అందరిలో విపరీతమైన ఇంట్రెస్ట్ మొదలైంది.
దానితో పవన్ కళ్యాణ్ OG సీక్వెల్ మాత్రమే కాదు, ఇంకా మరిన్ని సినిమాలు చేస్తారు, ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఆ దర్శకుడితో సినిమా, ఈ దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం షురూ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే ఏడాది మార్చి అంటే మహాశివరాత్రికి విడుదల చేసే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
అంతేకాదు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కనపెట్టి రాజకీయాలపైనే ఫోకస్ చెయ్యాలని, తనకున్న పవర్స్ తో ఏపీ ప్రజల సమస్యలు తీర్చేందుకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని, ప్రస్తుతం ఆయన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే మూడ్ లో లేరని తెలుస్తుంది. ముందు రాజకీయాలు తర్వాతే సినిమాలని పవన్ ఫిక్స్ అయినట్లుగా టాక్ అయితే గట్టిగానే వినబడుతుంది.