మీరు బిగ్ బాస్ కి వచ్చి బంధాలు పెట్టుకుని ఫైనల్ కి వెళదామని చూస్తున్నారా.. నాన్న అంటూ బాండింగ్ పెట్టుకుని, లవ్ ట్రాక్ వేసుకుని టాప్ 5 లోకి బిగ్ బాస్ కప్ గెలవాలని చూస్తున్నట్టుగా ఉంది అంటూ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అయేషా తనూజాను ఈవారం నామినేషన్స్ లో టార్గెట్ చేసి మట్లాడడం హౌస్ మేట్స్ కి షాకిచ్చింది.
ఈ వారం నామినేషన్స్ లో భాగంగా సుమన్ శెట్టి తనూజ ని నామినేట్ చేస్తే.. దానికి అయేషా తనూజ పేరు చెప్పి మీరు యాక్టింగ్ చేసింది స్టార్ మా సీరియల్స్ లో. మీ యాక్టింగ్ ఆడియన్స్ చూసేసారు. ఇక మీదట ఓన్ గా ఆడండి.. మీరు బాండింగ్స్ పెట్టుకుని సింపతీ గేమ్ ఆడుతున్నారు అంటూ అయేషా తనూజాను టార్గెట్ చేసింది.
నీ వల్ల మిగతా అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది అనేది నా పాయింట్. నీ వల్ల భరణి గారి గేమ్ కూడా పాడవుతుంది. నీకు ప్రతి గేమ్ లో భరణి గారు సపోర్ట్ చేసారు, నాకు నాన్న స్టాండ్ తీసుకోవడం లేదు అంటూ ఎందుకు ఏడుస్తున్నావ్ అనగానే అందరికి ఫేవరెట్స్ ఉన్నారు నాకే కాదు అంటూ తనూజ పై అయేషా మరింతగా రెచ్చిపోతూ ఇక్కడో నాన్నో, బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటే ఫైనల్ దాకా వచ్చేద్దామనే ప్లాన్ ఉంది టు బి ఫ్రాంక్ అంటూ అయేషా తనూజ ను కడిగేసిన ప్రోమో వైరల్ అవుతుంది.