మిరాయ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రాబోతున్న చిత్రం తెలుసు కదా. స్టార్ బాయ్ సిద్దు జొన్నల గడ్డ హీరోగా నటించిన ఈ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సోమవారం చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మరో డీసెంట్ హిట్ రాబోతుందనే ఫీలింగ్ కలుగుతోంది.
ఈ ట్రైలర్‌లో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తనదైన మ్యానరిజమ్స్, డైలాగ్స్‌తో, అలాగే ఇద్దరమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ.. సినిమాపై ఇంట్రెస్ట్‌ని కలిగించారు. స్టోరీ లైన్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక అమ్మాయి ముందే మరో అమ్మాయితో రొమాన్స్ చేస్తుండటం చూస్తుంటే.. నీరజా కోన ఓ పవర్ ఫుల్ కథని సిద్ధం చేసినట్లుగానే అనిపిస్తుంది. రాశీ ఖన్నా, శ్రీనిధి ఇద్దరూ కూడా వారి పాత్రలలో ఒదిగిపోయారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరికొత్త ప్రేమకథను ఈ సినిమా పరిచయం చేయబోతుందనేలా ట్రైలర్ హింట్ ఇచ్చేసింది.
అలాగే ఈ సినిమా సాంకేతికంగా కూడా అద్భుతంగా రూపొందినట్లుగా అర్థమవుతోంది. ముఖ్యంగా థమన్ మ్యూజిక్‌తో పాటు కెమెరా వర్క్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. మొత్తంగా అయితే, టిజె టిల్లు ప్యాట్రన్‌లో సరికొత్త ప్రేమకథగా తెలుగు కదా ఉండబోతుందనేది ఈ ట్రైలర్ తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకుంటూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.