పాపం వేణు బలగం చిత్రంతో దర్శకుడిగా భారీ హిట్ కొట్టినా ఆయన తదుపరి ప్రాజెక్ట్ మాత్రం సెట్ పైకి వెళ్లడమే లేదు. బలగం లాంటి హిట్ తర్వాత వేణు క్రేజీగా స్టార్ హీరో తో సినిమా చేస్తాడు అనుకున్నారు. అనుకున్నట్టే నాని వేణు తో మూవీకి కమిట్ అయ్యారు. ఎల్లమ్మ అనే టైటిల్ తో నాని తో వేణు మూవీ అనౌన్సమెంట్ కూడా వచ్చేసింది.
తీరా చూస్తే వేణు ఎల్లమ్మ ప్రాజెక్ట్ నుంచి నాని తప్పుకున్నాడు. ఆతర్వాత ఎల్లమ్మ ప్రాజెక్ట్ లోకి హీరో నితిన్ వచ్చాడు. దిల్ రాజు బ్యానర్ లో నితిన్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ ప్రాజెక్ట్ పై వార్తలొచ్చాయి. తమ్ముడు రిజల్ట్ తో నితిన్ వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. నితిన్ తర్వాత ఎల్లమ్మ కోసం శర్వానంద్ దిగాడు అంటూ ప్రచారం జరిగింది.
కానీ ఇప్పుడు మరో హీరో పేరు ఎల్లమ్మ ప్రాజెక్ట్ కోసం వినబడుతుంది. అది కిష్కిందపురి తో సక్సెస్ అందుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని వేణు ఎల్లమ్మ ప్రాజెక్ట్ కోసం సంప్రదిస్తున్నారని అంటున్నారు. మరి ఇప్పటికైనా ఎల్లమ్మ హీరోగా బెల్లంకొండ ఫిక్స్ అవుతాడో లేదంటే మరో హీరో మారతాడో అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ అనే చెప్పాలి.