Advertisementt

వార్ 2 ఓటీటీ రెస్పాన్స్

Fri 10th Oct 2025 03:30 PM
war2  వార్ 2 ఓటీటీ రెస్పాన్స్
War2 OTT release response వార్ 2 ఓటీటీ రెస్పాన్స్
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ తర్వాత హిందీలో తనకున్న క్రేజ్ చూసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పై యూనివర్స్ వార్ 2 తో డైరెక్ట్ గా బాలీవుడ్ లోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారు. హృతిక్ రోషన్ తో కలిసి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 యాక్షన్ ఫిలిం లో నటించారు. ఆగష్టు 14 న భారీ అంచనాలతో విడుదలైన వార్ 2 థియేటర్స్ లో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

వార్ 2 VFX , ఎన్టీఆర్ కేరెక్టర్, అయాన్ ముఖర్జీ దర్శకత్వాన్ని సినీ విమర్శకులు చీల్చి చెండాడారు. అసలు ఎన్టీఆర్ వార్ 2 లో ఎందుకు నటించాడో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోయారు. ఇక ఆగష్టు 14 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్ర ఓటీటీ రిలీజ్ పై నిన్నమొన్నటివరకు ఎడతెగని సస్పెన్స్ నడిచింది.

వార్ 2 డిజిటల్ హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ వార్ 2  ని ఓటీటీలో విడుదల చేసేందుకు చాలా సమయం తీసుకుంది. ఎట్టకేలకు అక్టోబర్ 9 నుంచి వార్ 2 ని ఓటీటీలో స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. వార్ 2 థియేటర్స్ లో ఎలాంటి టాక్ తెచ్చుకుందో ఓటీటీలోనూ అదే రెస్పాన్స్ తెచ్చుకుంది.

ప్రత్యేకించి ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ మరోసారి ఎన్టీఆర్ ని విమర్శిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. కొంతమంది థియేటర్స్ కన్నా ఓటీటీలో వార్ 2 బావుంది అంటూ స్పందించడం గమనార్హం. కథ లేకపోయినా హీరోల యాక్షన్ చాలు అంటున్నారు. వార్ 2 థియేటర్స్ లో కన్నా  ఓటీటీలోనే బావుంది అంటూ చాలామంది ట్వీట్లు వేస్తున్నారు.

War2 OTT release response:

War2 OTT Response

Tags:   WAR2
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ