నేడు అక్టోబర్ 10 దర్శకధీరుడు రాజమౌళి బర్త్ డే. ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ కు వెళ్లొచ్చిన రాజమౌళి పై హాలీవుడ్ లోను విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. నేడు రాజమౌళి బర్త్ డే కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ప్రముఖులంతా విషెస్ తెలియజేస్తున్నారు.
మరి మహేష్ అభిమానులు కొద్దిగా SSMB 29 అప్ డేట్ కోసం వెయిట్ చేసినా రాజమౌళి మాత్రం సింపుల్ గా తన పని తను చేసుకుంటున్నారు తప్ప మహేష్ మూవీ విషయాలేవీ రివీల్ చేయడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన డైరెక్టర్ రాజమౌళికి విషెస్ చెబుతూ షేర్ చేసిన పిక్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Wishing the one and only @ssrajamouli a very Happy Birthday…The best is always yet to come😍😍😍..Have a great one sir 🤗🤗🤗♥️♥️♥️ అంటూ మహేష్ రాజమౌళి కి చెప్పిన విషెస్ తెగ వైరల్ అవుతున్నాయి.