నార్త్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో.. సౌత్ లో మాత్రం అంత ఆదరణ పొందలేకపోయింది అనే చెప్పాలి. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోలు హోస్ట్ లుగా ఈ బిగ్ బాస్ ని నడిపిస్తున్నారు. తెలుగులో నాగార్జున హోస్ట్ గా సీజన్ 9 నడుస్తుంది, తమిళనాట విజయ్ సేతుపతి హోస్ట్ గా బిగ్ బాస్ మొదలయ్యింది. మలయాళంలో మోహన్ లాల్ హోస్ట్ గా బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలయ్యింది. కన్నడ బిగ్ బాస్ హోస్ట్ నుంచి సుదీప్ తప్పుకున్నారు.
ప్రస్తుతం బిగ్ బాస్ షో కన్నడలో కంటిన్యూ అవుతుంది. తాజాగా బిగ్ బాస్ కన్నడ షో కు బ్రేక్ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. కన్నడ బిగ్ బాస్ సెట్ ని బిడాదిలోని అమ్యూజ్మెంట్ పార్క్, బాలీవుడ్ స్టూడియోలో వేశారు. ఈ షో ను నిర్వహిస్తున్న ప్రదేశం నుండి దాదాపు రోజు 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకు వస్తున్నట్లు పర్యావరణ శాఖకు ఫిర్యాదులు రావడంతో వెంటనే వారు తనిఖీలు చేయడం మాత్రమే కాకుండా బిగ్ బాస్ హౌస్ కి తాళాలు వేసినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు మాత్రమే కాదు గతంలోను అనేక సార్లు బిగ్ బాస్ షో పై కంప్లైంట్స్ రావడం, షో లో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ వాడుతున్న వేస్టేజ్ ను కూడా రోడ్డుపై పారేయడం ఇలా అనేక విషయాలు జరుగుతుండడం వల్ల బిగ్ బాస్ సెట్ ఉన్న ప్రదేశానికి తాళాలు వేయడం మాత్రమే కాకుండా ఈ షో కు కరెంటును కూడా కట్ చేసినట్లుగా తెలుస్తుంది.