జగన్ ప్రతిపక్ష హోదా కోసం పోరాడడమే కానీ.. మిగతాదేమి ఆయన పట్టించుకోవడం లేదు, తాడేపల్లి, బెంగుళూర్ ప్యాలెస్ కి తిరగడమే కానీ ఆయన మిగతా విషయాల్లో అంటే ప్రభుత్వం పై పోరాడడం లేదు అనే భావన వైసీపీ కార్యకర్తల్లోను ముఖ్యంగా బ్లూ మీడియాలో బలంగా కనబడుతుంది.
జగన్ మోహన్ రెడ్డి సజ్జల లాంటి వాళ్లకు అధికారాలు ఇచ్చి సైలెంట్ గా ఉంటున్నారు, వాళ్ళే జగన్ ను పక్కనపెట్టేస్తున్నారు, జగన్ మేలుకో అంటూ జగన్ సోషల్ మీడియా ట్వీట్ల పై విమర్శలు మొదలు పెట్టింది బ్లూ మీడియా. విషయాన్ని సూటిగా చెప్పడానికి నాలుగు లైన్స్ ట్వీట్ చాలు, చాటభారతం అవసరమా..
రామ్ గోపాల్ వర్మ, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు తాము చెప్పాలనుకున్న విషయాలను సోషల్ మీడియా ద్వారా ఎంత స్పష్టంగా చెబుతారో.. సోది లేకుండా సూటిగా ఉంటాయా ట్వీట్లు, కానీ జగన్ గారు మీరు పెట్టె చాటభారత ట్వీట్లు చదివే తీరిక, వాటిని అర్ధం చేసుకునే ఓపిక ఎవ్వరికి లేవు, ముక్కుసూటిగా విషయమర్ధమయ్యేలా నాలుగు లైన్స్ లో ట్వీట్లు వేస్తె జనాలకు ఎక్కుతుంది.
మీరు అప్పజెప్పిన సోషల్ మీడియా టీం మీకు ఎలాంటి హెల్ప్ చేయకపోగా.. మీ మీద నెగిటివిటి పెంచుతుంది.. మీరు చాటభారతాలు చెప్పాలంటే మీకో సాక్షి పేపర్ ఉంది, టివి ఛానెల్ ఉంది, ఇక సోషల్ మీడియాలో షార్ట్ అండ్ స్వీట్ గా ప్రజలకు అర్ధమయ్యేలా ట్వీట్లు వెయ్యొచ్చు.
ట్వీట్ చూస్తే ఊపు రావాలి కానీ నీరసం రాకూడదు.. జగన్ ఇప్పటికైనా ప్రకాష్ రాజ్, RGV లాంటి వాళ్ళ ఎక్స్ ఖాతాలు చూసి నేర్చుకోమంటూ బ్లూ మీడియా జగన్ కు సలహాలిస్తుంది.