సెప్టెంబర్ 25 న విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG చిత్రానికి బెన్ఫిట్ షోస్ నుంచే బ్రహ్మాండమైన టాక్ స్ప్రెడ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ లుక్స్, ఆయన ఎలివేషన్స్ సీన్స్, థమన్ BGM అన్ని OG హిట్ అవడానికి హెల్ప్ అయ్యాయి. OG OG అంటూ పవన్ ఫ్యాన్స్ ఎంతగా రచ్చ చేసారో.. అందుకు తగ్గ ఫలితం అందుకున్నారు.
ఇక ఈచిత్రానికి వచ్చిన కలెక్షన్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద డిస్కర్షన్ జరుగుతున్నాయి. OG కి కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది అని, కొన్ని ఏరియాల్లో మాత్రం పది పదిహేను శాతం నష్టాలొస్తాయని అంటున్నారు. మరోపక్క OG 300 కోట్ల మార్క్ టచ్ చేసింది అంటున్నారు. ఇంత గందరగోళం నడుమ OG ఓటీటీ రిలీజ్ పై ఓ క్రేజీ న్యూస్ వినబడుతుంది.
OG చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ OG ని స్ట్రీమింగ్ చెయ్యాలని అది కూడా అక్టోబర్ 23 నుంచి అందుబాటులోకి తీసుకురావాలనే ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే OG థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీ లో స్ట్రీమింగ్ కి తెచ్చేలా నెట్ ఫ్లిక్ ప్లాన్ చేస్తుందన్నమాట.