నాగ చైతన్య సమంత ను ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని, నాలుగేళ్ళ వైవాహిక జీవితానికి విడాకులతో ముగింపు పలికిన తర్వాత చాలా త్వరగా హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ప్రేమలో పడి వివాహం చేసుకోవడం అందరికి పెద్ద షాక్ ఇచ్చింది. ఒకే సినిమాలో కలిసి నటించకపోయినా, అసలు పరిచయం లేని చైతు కి శోభిత కు నడుమ ప్రేమ ఎలా పుట్టింది, వారిద్దరూ ఎక్కడ మొదటిసారిగా కలిసారు అనే విషయంలో అక్కినేని అభిమానులే కాదు అందరిలో చాలా క్యూరియాసిటీ ఉంది.
మా ప్రేమ ఇన్స్టా లోనే పుట్టింది, మా పరిచయం ఇన్స్టాగ్రామ్ లోనే జరిగింది అని అటు చైతు, ఇటు శోభితాలు చాలా సందర్భాల్లో చెప్పారు. తాజాగా నాగ చైతన్య జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్ము రా షో లో తమ ప్రేమ ఎలా మొదలయ్యిందో మరోమారు నాగ చైతన్య రివీల్ చేసాడు.
తాను ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేస్తే దానికి శోభిత రిప్లై ఇచ్చింది, ఆ రిప్లై తర్వాత ఇద్దరి నడుమ మెసేజ్ లు మొదలై అలా అలా తమ లవ్ స్టోరీ పుట్టినట్టుగా నాగ చైతన్య ఆ షో లో రివీల్ చేసాడు. ఆ తర్వాత ఆ ప్రేమ పెద్దల అంగీకారంతో పెళ్లి గా మారింది అంటూ చైతు శోభిత తో పరిచయం, ప్రేమపై మరోసారి స్పష్టతనిచ్చాడు.