కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న సమంత ఇప్పటివరకు హెల్త్ విషయంగా సినిమాలకు బ్రేకిచ్చినట్టుగా చెప్పింది, అంతేకాదు పాడ్ క్యాస్ట్ ద్వారా ఆరోగ్య సూత్రాలను వల్లే వేస్తోన్న సమంత ఈనెలలో తను నిర్మిస్తూ నటించబోయే మా ఇంటి బంగారం షూటింగ్ మొదలు పెడుతున్నట్టుగా బిగ్ అప్ అభిమానులకు అందించింది.
అయితే నాగ చైతన్య తో విడిపోయాక సమంత ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనతో గడుపుతుంది. తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసిన సమంత ను ఆమె అభిమానులు చాలా ప్రశ్నలు అడిగారు. అందులో ముఖ్యంగా మీకు ఈశా ఫౌండేషన్ అంటే ఎందుకంత ఇష్టం అని అడిగిన ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ.. అది నాకు రెండో ఇల్లు లాంటిది. ఈశా ఫౌండేషన్ కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటూ సమంత సమాధానమిచ్చింది.
మరి సమంత విడాకుల తర్వాత అటు బాధ, ఇటు సోషల్ మీడియా ట్రోల్స్ తో సతమతమయ్యింది. అదే ఆమెను అనారోగ్యానికి గురి చేసింది. అలా అలా ఎక్కువగా సమంత ఆధ్యాత్మికత యాత్రలను ఎంచుకుని అందులోనే ఆమె ప్రశాంతతను వెతుక్కుంది. ఇషా ఫౌండేషన్ కు వెళుతూ.. అక్కడ ఆమె యోగ, ధ్యాన ముద్ర చేస్తూ కనిపించేది, ఆ విషయం అందరికి తెలిసిన విషయమే.