ఈరోజు సోమవారం విజయ్ దేవరకొండ ప్రయాణం చేస్తున్న కారు యాక్సిడెంట్ కి గురవడం ఆయన అభిమానులకు షాక్ కి గురి చేసింది. అయితే ప్రమాదంలో విజయ్ దేవరకొండ కు డ్యామేజ్ అయినా.. ఆయనకు ఎలాంటి గాయాలు అవకుండా సురక్షితంగా స్నేహితుల కారులో హైదరాబాద్ లోని ఇంటికి చేరుకున్నారు ఆతర్వాత.. ఎక్స్ వేదికగా తన కారు ప్రమాదంపై విజయ్ స్పందించారు.
అంతా బాగానే ఉంది, కారు మాత్రమే దెబ్బతింది, కానీ మేమంతా సురక్షితంగా బాగానే ఉన్నాము. స్ట్రెంగ్త్ వర్కౌట్స్ కూడా చేసి ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాను. మీ అందరికీ నా ప్రేమ మరియు అతి పెద్ద కౌగిలింతలు. ఈ వార్త మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయనివ్వకండి…. అంటూ ఎక్స్ లో విజయ్ దేవరకొండ.. వీడియో షేర్ చేసారు.