కింగ్ నాగార్జున తన ఐకానిక్ ఫిలిం, కెరీర్ లో గొప్పగా నిలిచిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అది కూడా ఏడాదిన్నరగా.. ఈ మధ్యలో నాగార్జున కుబేర, కూలి చిత్రాల్లో నెగెటివ్ రోల్స్ తో అద్దరగొట్టేసిన నాగార్జున 100 తన చిత్రాన్ని త్వరలోనే మొదలు పెడతారని ప్రచారం జరుగుతుంది. గ్రాండ్ గా సినిమా ఓపెనింగ్ చెయ్యాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నారట.
ప్రస్తుతం బిగ్ బాస్ హోస్ట్ గా హడావిడిగా వున్న నాగార్జున రీసెంట్ గా భార్య అమల తో కలిసి గోవా కి వెళ్లొచ్చారు. అయితే నాగార్జున తన 100 వ చిత్రాన్ని తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం చేయనున్నాడు. కార్తీక్ తో కలిసి కింగ్ నాగార్జున గత ఆరు నెలలుగా ట్రావెల్ చేస్తున్నట్టుగా జగపతిబాబు షోలో చెప్పారు.
కార్తీక్-నాగార్జున ప్రాజెక్ట్ కి టైటిల్ లాటరీ కింగ్ ని పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. నాగార్జునని అందరూ కింగ్ అని పిలుస్తుంటారు. అందువల్లే క్యాచీగా ఉంటుందని, లాటరీ కింగ్ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని అనుకుంటున్నారట. తన కెరీర్ లోనే ఐకానిక్ ఫిలిం కావడంతో స్క్రిప్ట్ సహా అన్ని కేటగిరీల్లోనూ నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట, అందుకే ఈప్రాజెక్టు లేట్ అవుతుంది అని సమాచారం.
ఈ సినిమాలో నాగచైతన్య, అఖిల్ కూడా గెస్ట్ రోల్స్ లో మెరుస్తున్నారని, ఈ ప్రాజెక్ట్ కి అదే స్పెక్షన్ అట్రాక్షన్ అని తెలుస్తోంది.