ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Top producer who does not pick up distributors phone

డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ ఎత్తని టాప్ ప్రొడ్యూసర్

Top producer who does not pick up distributors phoneTop producer who does not pick up distributors phone

రీసెంట్ గా విడుదలైన ఓ పెద్ద సినిమా ప్రొడ్యూసర్ డిస్ట్రీబ్యూటర్స్ ఫోన్ ఎత్తడం లేదనే మాట సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. మూడేళ్ళుగా సెట్ పై ఉన్న సినిమాని ఎలాగో పూర్తి చేసి విడుదల చేసారు. అది కూడా విపరీతమైన అంచనాలతో విడుదలైన ఆ సినిమాకి క్రిటిక్స్, ప్రేక్షకులు ఆహా ఓహో అన్నారు. 

ఇంకేంటి ఈ టాక్ తో సినిమా కలెక్షన్స్ రికార్డుల వేటే.. నిర్మాతకు భారీ లాభాలు ఖాయమనుకున్నారు. తీరాచూస్తే ఆ సినిమాకు బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేకుండా మరో పాన్ ఇండియా మూవీ అడ్డుకట్ట వేసింది. లాభాలు రాకపోయినా ఒడ్డున పడతాడనుకున్నా ఆ నిర్మాత ఇప్పుడు వచ్చే నష్టాలు లెక్కలేసుకుని కొన్నాళ్ళు సినిమా నిర్మాణానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఆ సినిమా దర్శకుడు ఎక్కువ ఖర్చు పెట్టించడం, హీరో గారి డేట్స్ ఇవ్వకపోవడంతో నిర్మాత నిండామునిగాడని, అందుకే నిర్మాతగా కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడని నఅంటుంటే.. ఆ పెద్ద సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ సదరు నిర్మాతకు ఎన్ని ఫోన్స్ చేసినా ఫోన్ ఎత్తడం లేదని అంటున్నారు. 

Top producer

producer