థియేటర్స్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ చిత్రాన్ని ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూసేయ్యలా అని ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ చాలా ఎదురు చూసారు. అంతలా లిటిల్ హార్ట్స్ ని మౌళి అండ్ టీం ప్రమోట్ చేసింది. అంతేకాదు థియేటర్స్ లోను లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్ కలెక్షన్స్ కొల్లగొట్టింది.
అందుకే ఓటీటీ కోసం అందరు అంత ఇదిగా ఎదురు చూసారు. ఈటివి విన్ నుంచి అక్టోబర్ 1 న స్ట్రీమింగ్ లోకి వచ్చిన లిటిల్ హార్ట్స్ ని అందరూ ఎగబడి చూసారు. ఓటీటీలో ఆ సినిమా చూసాక యూత్ మొత్తం ఈ సినిమా థియేటర్స్ లో ఎలా హిట్ అయ్యిందిరా బాబు అంటూ మాట్లాడుకోవడం గమనార్హం.
మౌళి, శివాని యాక్టింగ్ బావున్నా.. డైలాగ్స్ అంతగా ఏమి ఇంప్రెస్స్ చెయ్యలేదు, ఈ సినిమాకి క్రిటిక్స్ ఎక్కువ రేటింగ్స్ ఇచ్చారు, థియేటర్స్ లో అంత కలెక్షన్స్ ఎందుకొచ్చాయో అనేది కాస్త విచిత్రంగానే ఉంది అంటూ ఓటీటీ ఆడియన్స్ మాట్లాడుతున్నారు. థియేటర్స్ లో ఆహా ఓహో అన్న లిటిల్ హార్ట్స్ ని ఓటీటీ లో చూసినవాళ్లు మాత్రం పెదవి విరుస్తున్నారు.