కొన్నేళ్లుగా సీక్రెట్ డేటింగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న లు మా మధ్యన ఏమి ఏమి లేదు అంటూనే ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు శుక్రవారం ఓ ప్రవేట్ ఫంక్షన్ లో ఫ్యామిలీ మెంబెర్స్ నడుమ నిశ్సితార్ధం చేసుకున్న ఈ జంట వచ్చే ఏడాది అంటే 2026 లో పెళ్లి పీటలెక్కుతారని సమాచారం.
విజయ్ దేవరకొండ-రష్మిక లు 2026 ఫిబ్రవరిలో వివాహం చేసుకుంటారని తెలుస్తుంది. డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నప్పటి నుంచి వీరి మద్యన ప్రేమ మొదలైంది అని, సీక్రెట్ డేటింగ్, సీక్రెట్ వెకేషన్స్ లో కలుసుకునే ఈ జంట ఇప్పుడు నిశ్సితార్ధం చేసుకుని కొత్త లైఫ్ కి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా టాక్ వినబడుతుంది.
ప్రస్తుతం రష్మిక ఫుల్ కమిట్మెంట్స్ తో బిజీగా వుంది. అటు విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్స్ తో బిజీగా వున్నాడు. అందుకే వచ్చే ఏడాది వీరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లుగా తెలుస్తుంది.