తమిళనాడులో బాంబ్ బెదిరింపు కలకలం సృష్టించింది. తమిళనాడు సీఎం స్టాలిన్ ఇంటికి, ఆయన ఆఫీస్ కి, అలాగే తమిళనాడు గవర్నర్ భవనం, బీజేపీ ఆఫీస్, నటి త్రిష ఇంట్లో బాంబ్ పెట్టామంటూ కొంతమంది ఆగంతకులు ఫోన్ చేసి బెదిరించడంతో తమిళనాడు పోలీసులు తనిఖీలు చేపట్టారు.
బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పాటు పలు ప్రత్యేక బలగాలను రంగంలోకి దించి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభ్యంకాలేదని పోలీసులు వెల్లడించారు.
హీరోయిన్ త్రిషా చెన్నై నగరంలోని సెనోటాఫ్ రోడ్ వద్ద నివసిస్తున్నారు. అక్కడ కూడా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అయితే కొంతమంది ఆకతాయిలు కావాలనే బాంబ్ బెదిరింపులకు పాల్పడ్డారని, బాంబ్ బెదిరింపు కాల్ కేవలం ఫేక్ కాల్ అని పోలీస్ తెల్చేయ్యడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.