కాంతార కన్నడ లో విడుదలైన అద్భుతమైన హిట్ అవడమే కాదు, ఆ తర్వాత పాన్ ఇండియా భాషల్లోనూ కాంతార ను ప్రేక్షకులు తెగ ఆదరించేసారు. కాంతార పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రిషబ్ శెట్టి దానికి ప్రీక్వెల్ అంటూ భారీ బడ్జెట్ పెట్టి కాంతార చాప్టర్ 1 తెరకెక్కించి దసరా స్పెషల్ గా అక్టోబర్ 2 న విడుదల చేసారు.
కాంతార చాప్టర్ 1 డబ్బింగ్ చిత్రమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ముందురోజు నుంచే ప్రీమియర్స్ తో సందడి చేసింది. ప్రీమియర్స్ స్టార్ట్ అయినప్పటినుంచి కాంతారకు సోషల్ మీడియాలో మిక్స్డ్ రివ్యూస్ కనిపించాయి. సినిమా ఫస్ట్ హాఫ్ కనీసం యావరేజ్ గా కూడా లేదు అంటూ ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఫస్ట్ హాఫ్ మరీ బోరింగ్, మరీ చెత్తగా ఉంది అన్నారు.
కాంతార చాప్టర్ 1 కి క్లైమాక్స్ లేకపోతే సినిమా అట్టర్ ప్లాప్ అయ్యేది, కాంతారా ను ఆ 20 నిమిషాలే గట్టెక్కించాయి. కాంతారా చాప్టర్ 1 క్లయిమాక్స్ మీ టికెట్ రేటు ని గిట్టుబాటు చేసేస్తుంది.. ఎన్నో హోప్స్ పెట్టుకుని థియేటర్ కి వెళితే ఇంత డిజప్పాయింట్ చేసావేమిటి రిషబ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
రిషబ్ శెట్టి పెరఫార్మెన్స్ సూపర్బ్, VFX, BGM ఇంకా సినిమాటోగ్రఫీ, కొన్ని యాక్షన్స్ సీన్స్ మాత్రమే కాంతార1 కు ప్లస్ అయ్యాయి అంటూ కాంతార చాప్టర్ 1 పై పాన్ ఇండియా ప్రేక్షకులు కామెంట్లు పెడుతున్నారు.