వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులు ఈమధ్యనే పండంటి మెగా బిడ్డకు జన్మనిచ్చారు. లావణ్య మెగా ఫ్యామిలీకి వారసుడిని అందించింది. రెండు రోజుల క్రితమే వరుణ్ తేజ్ కొడుక్కి ఉయ్యాల ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించారు. మెగా ఫ్యామిలీ మొత్తం నాగబాబు ఇంటికి వెళ్లారు.
ఇక ఈరోజు విజయదశమి పండుగ స్పెషల్ గా వరుణ్ తేజ్-లావణ్య లు పండుగ సెలెబ్రేషన్స్ లో భాగంగా కొడుకు పేరుని రివీల్ చేసారు. Vaayuv Tej Konidela! వాయువ్ తేజ్ కొణిదెల గా కొడుకుకి నామకరణం చేసినట్టుగా వరుణ్ తేజ్ జంట రివీల్ చేసారు.
మెగా వారసుడు పేరు వాయువ్ తేజ్ గా రివీల్ చేసేసరికి మెగా ఫ్యాన్స్ బుడ్డోడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.