టాలీవుడ్, బాలీవుడ్ కి సుపరిచితుడైన హర్షవర్దన్ రాణే ప్రస్తుతం హిందీ చిత్రసీమలో దూసుకెళుతున్నాడు. పాల్టాన్, తైష్, సనమ్ తేరి కసమ్, సావి, హసీన్ దిల్ రూబా లాంటి చిత్రాలలో అతడి నటనకు గుర్తింపు దక్కింది. ముఖ్యంగా `సనమ్ తేరి కసమ్` లాంటి వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంలో అతడి నటనకు విమర్శకుల ప్రశంసలు కురిసాయి. ఈ చిత్రం కరోనా సమయంలో రెండో రిలీజ్ లోను పెద్ద విజయం సాధించి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం అతడు నటిస్తున్న ఏక్ దీవానే కి దీవానియాత్ దీపావళి విడుదలకు సిద్ధమవుతోంది
ఈ సమయంలో హర్షవర్ధన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోషూట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అతడు కెరీర్ బిజీ లైఫ్ ఎలా ఉన్నా ప్రకృతి జీవనం ఎలా సాగించాలో చెబుతున్న ఈ ఫోటోషూట్ అందరినీ ఆకట్టుకుంటోంది. పచ్చని వాతావరణంలో అతడు అన్నిటినీ మరిచి తన కారవ్యాన్ లో వంట చేసుకుంటున్నాడు. అక్కడే అతడు తన ల్యాప్ టాప్ ని ఉపయోగిస్తూ డ్యూటీ చేస్తున్నాడు. ఆ రోజంతా అక్కడ స్వేచ్ఛగా ప్రకృతిలో జీవించాడు. సర్వైవల్ మోడ్ కాదు.. ఎలా జీవించాలో అతడు చెప్పినది ఆకట్టుకుంది. ప్రస్తుతం హర్షవర్ధన్ అతడి కారవ్యాన్ లివింగ్ స్టైల్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
మ్యూజిక్, లవ్, హార్ట్ బ్రేకింగ్ అంశాలతో రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా ఏక్ దీవానే కి దీవానియాత్‌ను అన్షుల్ గార్గ్ తన బ్యానర్ దేశీ మ్యూజిక్ ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మించారు. రాఘవ్ శర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాల్లోను హర్షవర్ధన్ నటిస్తున్నాడు.