తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు, అందుకే తన సినిమాలను తెలుగులోనూ విడుదల చేస్తున్నాడు కోలీవుడ్ హీరో ధనుష్. సార్, కుబేర చిత్రాలే కాదు ముచ్చటగా మూడో సినిమా కూడా టాలీవుడ్ లో మొదలు పెట్టేందుకు రెడీ అయ్యాడు. అలాంటి ధనుష్ తన తమిళ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నా ఇక్కడి ప్రమోషన్స్ పట్టించుకోవట్లేదు.
ధనుష్-నిత్యా మీనన్ ల ఇడ్లి కొట్టు రేపు అక్టోబర్ 1 బుధవారం విడుదల కాబోతుంది. ఇడ్లి కడాయ్ అంటూ తమిళంలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఇడ్లి కొట్టు అంటూ రిలీజ్ చేస్తున్నారు కానీ.. ప్రమోషన్స్ మాత్రం చెయ్యడం లేదు. ఏదో చిన్న హీరో సినిమాని డబ్ చేసి వదిలినట్టుగా ధనుష్ సినిమాని ఇక్కడ విడుదల చేస్తున్నారు.
కేవలం ఇడ్లి కొట్టు పోస్టర్స్ తప్ప తెలుగులో మరో ప్రచారం లేదు. అది చూసే ఇడ్లి కొట్టు అసలు ధనుష్ సినిమానేనా, అయితే తెలుగుని అంత లైట్ తీసుకున్నారేమిటో అంటూ తెలుగు ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. అన్నట్టు కుబేర చిత్రం తెలుగులో పెద్ద హిట్టు, కానీ తమిళనాట ప్లాప్. మరి ధనుష్ ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులను విస్మరిస్తే ఎలా..