నటించిన మొదటి సినిమాతోనే 500 కోట్ల క్లబ్ హీరో అయ్యాడు అహాన్ పాండే. అతడు నటించిన `సయ్యారా` బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారతదేశంలో తెరకెక్కిన ప్రేమకథా చిత్రాల్లో నంబర్ వన్ వసూళ్లతో సయ్యారా రేర్ ఫీట్ సాధించింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో రెండో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగాను రికార్డులకెక్కింది. అందుకే అహాన్ తదుపరి చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజా సమాచారం మేరకు.. నవతరం హీరో అహాన్ తదుపరి కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి పని చేస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అహాన్ శనివారం నాడు భన్సాలీ కార్యాలయంలో కనిపించడంతో ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. అహాన్ కోసం భన్సాలీ ప్రత్యేకమైన ప్రేమకథా చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
అతడు భన్సాలీ సినిమాలో వినల్ గా నటిస్తాడని కూడా కొందరు అభమానులు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసారు. ఈ జోడీ నుంచి సినిమా రావాలి... అహాన్ దీనికి అర్హుడు! అని కొందరు వ్యాఖ్యానించారు. అయితే ఇరు వర్గాలు ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ గురించి ధృవీకరించలేదు. ఈ ప్రాజెక్ట్ వెంటనే ఉంటుందా లేక కొంత సమయం పడుతుందా? అన్నదానిపైనా ఎలాంటి సమాచారం లేదు. భన్సాలీతో అహాన్ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.