ఈరోజు ఆదివారం హైదరాబాద్ లో రిషబ్ శెట్టి కథానాయకుడిగా తెరకెక్కిన కాంతారా చాప్టర్ 1 ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు. రీసెంట్ గా ఓ యాడ్ షూట్ లో గాయపడిన ఎన్టీఆర్ కాంతార ఈవెంట్ కి వస్తున్నారు అనగానే ఆయన అభిమానులు కొకల్లలుగా వచ్చిపడ్డారు.
ఎన్టీఆర్ బాగానే ఉన్నారు, ఎప్పటిలా గట్టిగా అరవలేను అంటూ అభిమానులతో బాగానే మాట్లాడిన ఎన్టీఆర్ ని అభిమానులు తనివితీరా చూసుకుంటే.. ఓ వర్గం ఆడియన్స్ వార్ 2 ఫెయిల్యూర్ తర్వాత ఎన్టీఆర్ కాంతార ఈవెంట్ లో ఎలా మట్లాడుతారో అనే క్యూరియాసిటీ చూపించారు. ఎన్టీఆర్ రీసెంట్ గా జరిగిన ప్రమాదంతో నేను ఎక్కవసేపు నిలబడలేను అంటూ కాసేపు మాట్లాడి స్టేజ్ దిగేసారు.
ఇదే ఈవెంట్ లో హీరోయిన్ రుక్మిణి వసంత్ ని ఎన్టీఆర్ గురించి చెప్పాలని సుమ అడిగిన ప్రశ్నకు ఆయన గురించి చెప్పాలంటే ఆయనొక డిక్షనరీ అని చెప్పింది రుక్మిణి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని అయితే ఎన్టీఆర్-నీల్ అప్ డేట్ ను కాంతారా ఈవెంట్ సాక్షిగా రివీల్ చేసేసారు. నెక్స్ట్ మంత్ లో షెడ్యూల్ మొదలవుతుంది, అదే కంటిన్యుటిలో షూటింగ్ పూర్తవుతుంది. మేము మీకు ప్రామిస్ చేసినట్టు, బెస్ట్ రిలీజ్, బెస్ట్ డేట్ లోనే కి ఇస్తాము, సినిమాపై అంచనాలను మీ ఆలోచనకే వదిలేసాము, అది అది అది వేరే లెవల్,
ఇక #NTRNeel లో ఎన్టీఆర్ అన్నకి సరిపోయే హీరోయిన్ ఎవరని వెతికితే... కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ కనపడ్డారు. ఎన్టీఆర్ అన్న అంత కాకపోయినా అట్లీస్ట్ 80% ఇస్తారని ఎక్ష్పెక్ట్ చేస్తున్నాం.. అంటూ నవీన్ ఎర్నేని కాంతారా ఈవెంట్ లో #NTRNeel ముచ్చట్లు అలా అలా చెప్పేసారు.