Advertisementt

అసెంబ్లీ లో బాలయ్య పవర్ పంచ్

Thu 25th Sep 2025 05:09 PM
balakrishna  అసెంబ్లీ లో బాలయ్య పవర్ పంచ్
Balakrishna Fires On Ys Jagan అసెంబ్లీ లో బాలయ్య పవర్ పంచ్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ నేడు గురువారం అసెంబ్లీ లో సినీ ప్రముఖులపై విరుచుకుపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత వైసీపీ పాలనలో టాలీవుడ్ ఎదుర్కొన్న సమస్యలు, టికెట్ రేట్ల గురించి వివరించడానికి సినీ పెద్దలు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, మొదలైన వారు అప్పటి సీఎం జగన్‌ను కలిశారు. 

కానీ జగన్ ఇప్పుడు కలవడం కుదరదని చెప్పించారు.. అంతేకాకుండా వెళ్లి సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమని చెప్పారని, కానీ చిరంజీవి కలుగజేసుకుని గట్టిగా మాట్లాడితే.. జగన్ వచ్చి సినీ ప్రముఖులను కలిశారని కామినేని అనడంతో.. 

అదే అసెంబ్లీలో ఉన్న ఎమ్యెల్యే నందమూరి బాలకృష్ణ కామినేని పై ఫైర్ అవుతూ.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలంటూ.. చిరంజీవి గట్టిగా అడగటం వల్లే సైకో గాడి ని(జగన్) వచ్చి కలిశారని చెప్పడం అంతా అబద్దం, ఆ సమయంలో అక్కడ ఎవరూ గట్టిగా మాట్లాడలేకపోయారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కమిటీ అప్పుడు తనకు ఇన్విటేషన్ వచ్చింది అని ఆ లిస్ట్ లో తనది 9వ పేరుగా నమోదు చేయడంపై తాను కందుల దుర్గేష్‌ను అడిగానన్నారు. 

ఎవడు అడిగాడు గట్టిగా... అడిగితేనే లోపలకి పంపించాడా అంటూ బాలకృష్ణ ఆగ్రహంగా మాట్లాడుతూ.. ఇది క్లారిఫై చేయడానికే తాను మాట్లాడాను నాన్ సెన్స్ అంటూ బాలయ్య కూర్చోవడం హాట్ టాపిక్ గా మారింది. 

Balakrishna Fires On Ys Jagan :

MLA Balakrishna Fires On Ys Jagan In AP Assembly

Tags:   BALAKRISHNA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ