పవన్ OG రిలీజ్-నారా లోకేష్ ట్వీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ OG చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఏపీ ఐటి మినిస్టర్ నారా లోకేష్ వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్-నారా లోకేష్ నడుమ అనుబంధం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం.
సొంత అన్నదమ్ముల్లా పవన్-లోకేష్ ల అనుబంధం ఏపీ రాజకీయాల్లో హైలెట్ అవుతోంది. ఇక OG రిలీజ్ ముంగిట నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా OG నుంచి పవన్ పవర్ ఫుల్ లుక్ షేర్ చేస్తూ..
#OG అంటే Original Gangster. మా పవన్ అన్న అభిమానులకు మాత్రం Original God. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న #OG సినిమా విడుదల సందర్భంగా పవన్ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అంటూ ట్వీట్ చేసారు.