Advertisementt

4సార్లు చనిపోయేవాడిని-రిషబ్ శెట్టి

Tue 23rd Sep 2025 04:58 PM
rishab shetty  4సార్లు చనిపోయేవాడిని-రిషబ్ శెట్టి
Rishab Shetty on Kantara Chapter 1 near death experiences 4సార్లు చనిపోయేవాడిని-రిషబ్ శెట్టి
Advertisement
Ads by CJ

కాంతార చాప్టర్ 1 షూటింగ్ స్టార్ట్ అయినప్పటినుంచి సెట్ లో జరిగిన ప్రమాదాలు చిత్ర బృందాన్ని కలవరపెట్టాయి. జూనియర్ ఆర్టిస్ట్ ల  యాక్సిడెంట్, ఆతరవాత పడవ ప్రమాదం, యూనిట్ సభ్యులు కొంతమంది అనుకోకుండా హార్ట్ ఎటాక్ తోనూ, నీటమునిగి చనిపోవడం వంటి ప్రమాదాలు మూవీ యూనిట్ ని టెన్షన్ పెడితే.. మీడియాలో ఆ వార్తలు చాలా హైలెట్ అయ్యాయి. 

కాంతార సినిమా విడుదల ముందు ఈ చిత్రం హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి అదే చెబుతున్నాడు. కాంతార ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. తను కాంతార షూటింగ్ సమయంలో నాలుగు సార్లు ప్రమాదం నుంచి కాదు కాదు చావు నుంచి బయటపడినట్లుగా చెప్పారు. కాంతార చాప్టర్ 1 షూటింగ్ సమయంలో తనకు నాలుగుసార్లు ప్రమాదం జరిగింది అని.. 

ఆ సమయంలో తాను చనిపోయేవాడినేనని, కానీ తనని ఆ దేవుడే తనను కాపాడాడని, ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఈ చిత్రం ఎన్ని ఆటంకాలు ఏర్పడినా వాటిని అధిగమించి షూటింగ్ పూర్తి చేశామని రిషబ్ శెట్టి చెప్పారు. ఈ సినిమా కోసం టీమ్ అంతా మూడు నెలలు నిరంతరం పని చేసిందని విశ్రాంతి కూడా తీసుకోలేదని తెలిపారు. ప్రతిఒక్కరూ దీన్ని వారి సొంత సినిమాగా భావించారని చెప్పారు. 

సెట్లో జరిగిన ప్రమాదాలు అన్నీ ఎప్పటికప్పుడు మీడియాలో వచ్చాయని రిషబ్ శెట్టి ఆ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. 

Rishab Shetty on Kantara Chapter 1 near death experiences:

Kantara Chapter 1 - Rishab Shetty shares near death experiences

Tags:   RISHAB SHETTY
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ