బిగ్ బాస్ కి వెళ్ళకముందు జబర్దస్త్, అలాగే సీరియల్స్, సోషల్ మీడియాలో గ్లామర్ గా హడావిడి చేసిన రీతూ చౌదరిపై వైసీపీ లీడర్స్ తో సంబంధాలు ఉన్నాయనే విషయంలో చాలా రచ్చ నడిచింది. ఆతర్వాత ఆమె బిగ్ బాస్ లోకి వెళ్ళింది. బిగ్ బాస్ లో రీతూ చౌదరి ఎలా ఉందొ ఏమిటో కానీ.. బయట మాత్రం ఆమె పరువు పోయేలా కనిపిస్తుంది ప్రస్తుతం వ్యవహారం..
కారణం రీతూ చౌదరి డ్రగ్స్ తీసుకుంటుంది, ఆమె హీరోతో సంబంధం పెట్టుకుంది అంటూ హీరో భార్య రీతూ చౌదరి వీడియోస్ షేర్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ వీడియోలు గౌతమి అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేయడం పెద్ద దుమారానికి దారి తీస్తోంది.
గౌతమి తన భర్తతో రిలేషన్ షిప్‌లో ఉండింది రీతూ అనే అర్థం వచ్చేలా ఫొటోలు, వీడియోలను గౌతమి విడుదల చేసింది. గౌతమి ఇటీవలే తన భర్త, టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ తనను కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రీతూ చౌదరి కారణంగానే తనతో గొడవులు పెట్టుకున్నట్లు కొన్ని సాక్ష్యాలను గౌతమి షేర్ చేసింది.
మరి హౌస్ లో బిగ్ బాస్ కప్ కోసం రీతూ పోరాడడమేమో కానీ.. ఆమెని డీ ఫేమ్ చేస్తూ వదిలిన వీడియోస్ పై రీతూ ఎంతగా పోరాడాల్సి వస్తుందో తెలియదు. ఏది ఏమైనా రీతూ చౌదరి కెరీర్ పై ఈ వీడియోస్ మాత్రం మాయని మచ్చ అనే చెప్పాలి.