నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇప్పటివరకు చాలా ట్రెడిషనల్ గాను, సాంప్రదాయంగాను కనిపించింది. ఫిదా చిత్రంలో బుల్లి ఫ్రాక్ లో కనిపించినా అది పాత్ర డిమాండ్ ను బట్టి వెయ్యాల్సి వచ్చింది అని చెప్పిన సాయి పల్లవి మరే చిత్రంలోనూ హద్దులు దాటలేదు. అందుకే ఆమెకు స్టార్ హీరోల అవకాశాలు రాలేదు.
ఇప్పుడు సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. రామాయణ లాంటి గొప్ప చరిత్ర ఉన్న మూవీలో సీత కేరెక్టర్ లో నటిస్తుంది. ఇక ఫ్యామిలీతో ట్రిప్స్ వెళ్లినా, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసినా, లేదంటే ఆధ్యాత్మిక యాత్రలు చేసినా సాయి పల్లవి ఎక్కువగా చుడీదార్స్ లోనే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో అయినా తన పరిమితి దాటదు .
కానీ ఇప్పుడు సాయి పల్లవి బికినీ ఫొటోస్ షేర్ చేసి అందరికి షాకిచ్చింది. తన చెల్లెలు పూజా కన్నన్‌తో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి సముద్ర తీరంలో బికినీలో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. అక్కాచెల్లెళ్లిద్దరూ కలిసి బీచ్‌లో బికినీతో కనిపించిన ఫొటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది.
సాయి పల్లవి ఇలాంటి డ్రెస్ లోనా అంటూ అందరూ బోరెళ్లబెడుతున్నారు. అసలు ఆమె సాయి పల్లవినేనా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.