వరుస పెట్టి ట్రైలర్లు రిలీజవుతుంటే అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరుగుతుంది. రాబోవు సినిమాలపై అంచనాలు పెరగడం ఖాయం. ఇప్పుడు ట్రైలర్ల రాకతో టాలీవుడ్ కళకళలాడబోతోంది. అభిమానుల క్యూరియాసిటీ నడుమ పరిశ్రమ అగ్ర హీరోలు పవన్ కల్యాణ్, ప్రభాస్ నటించిన రెండు ట్రైలర్లు దూసుకురాబోతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ తెరకెక్కంచిన భారీ గ్యాంగ్ స్టర్ మూవీ ఓజీ ట్రైలర్ రాక కోసం చాలా ఉత్కంఠ నెలకొంది. ఈ ట్రైలర్ ని 21సెప్టెంబర్ ఉదయం రిలీజ్ చేయాలని భావించినా చివరి నిమిషంలో ఇది వాయిదా పడింది. ట్రైలర్ ని ప్రీరిలీజ్ వేడుక(ఓజీ కాన్సెర్ట్)లో రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించినట్టు తెలుస్తోంది. ఈ మార్పు అభిమానులను కొంత నిరాశపరిచినా ఆరోజు కోసం ఆసక్తిగా ఇప్పుడు వేచి చూస్తున్నారు.
ఓజీ ట్రైలర్ తర్వాత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ ట్రైలర్ కూడా దూసుకురానుంది. అక్టోబర్ 1 ముహూర్తం ఫిక్స్ చేసారు మారుతి టీమ్. రాజా సాబ్ ప్రభాస్ కెరీర్ మొదటి హారర్ థ్రిల్లర్ మూవీ. మాళవిక మోహనన్ ఈ చిత్రంలో కథానాయికగా నటించింది. ఆసక్తికరంగా అక్టోబర్ 2న థియేటర్లలో కి వస్తున్న కాంతార చాప్టర్ 1 తో పాటు రాజాసాబ్ ట్రైలర్ ని ప్రమోట్ చేస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది. కాంతార చాప్టర్ 1 స్క్రీన్లకు ఇది అటాచ్ అవుతుంది.. అలాగే కాంతార చాప్టర్ 1 ట్రైలర్ సెప్టెంబర్ 22న విడుదల కానుండగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంద. వరుసగా మూడు ట్రైలర్లు వేటికవే ప్రత్యేకం అని నిరూపిస్తే, పబ్లిక్ లో ఉత్సాహం పెరుగుతుందనడంలో సందేహం లేదు.