ఈ నెల 25 న విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ OG చిత్రం పై పవన్ ఫ్యాన్స్ లో ఎంత క్రేజ్ ఉందొ అనేది అంచనా వెయ్యడానికి లేదు. సెప్టెంబర్ 24 నుంచే OG ప్రీమియర్స్ మొదలు కాబోతున్నాయి. తెలంగాణాలో 24 నైట్ 9 గంటలకే OG ప్రీమియర్స్ మొదలవుతున్నాయి. ఫ్యాన్స్ లో OG పై అంతకంతకు క్రేజ్ పెరిగిపోతుంది.
తాజాగా పవన్ కళ్యాణ్ అభిమాని చిత్తూరులో ఓజీ సినిమా ఫస్ట్ టికెట్‌ను లక్ష రూపాయిలకు కొనడం హాట్ టాపిక్ అయ్యింది. దీనిని బట్టే OG పై ట్రేడ్ లోను అభిమానుల్లోనూ ఎంత పిచ్చ క్రేజ్ ఉందొ అనేది అర్ధమైపోతుంది. అయితే OG టికెట్ కి వచ్చిన లక్ష రూపాయలను గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా జనసేన పార్టీ ఆఫీస్‌కు పంపించేందుకు థియేటర్ యాజమాన్యం సిద్ధమైంది.
మరి పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు అంతలా ఖర్చు పెడుతుంటే ఆ డబ్బులను క్యాష్ చేసుకోకుండా థియేటర్స్ యాజమాన్యాలు పవన్ పై ఉన్న అభిమానంతో ఇలా గ్రామాల అభివృద్ధికి ఖర్చు చెయ్యడం నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిన విషయం.