Advertisementt

లాయ‌ర్‌కి స్టార్ హీరో 100కోట్లు ఇవ్వ‌డానికి రెడీ

Sat 20th Sep 2025 11:48 AM
shah rukh khan  లాయ‌ర్‌కి స్టార్ హీరో 100కోట్లు ఇవ్వ‌డానికి రెడీ
Star hero ready to give 100 crores to lawyer లాయ‌ర్‌కి స్టార్ హీరో 100కోట్లు ఇవ్వ‌డానికి రెడీ
Advertisement
Ads by CJ

భూమ్మీద పుట్ట‌గానే మ‌నిషికి ఎవ‌రి సాయం అవ‌స‌రం?  మొద‌ట అమ్మ ప‌సికందును సాకుతుంది. ఆ త‌ర్వాత నాన్న అవ‌స‌రం. అటుపై స్కూల్ టీచ‌ర్. ఇంకా పైపైకి ఎదిగే కొద్దీ సంఘంతో త‌ల‌నొప్పుల నుంచి ఆదుకునేది - లాయ‌ర్ లేదా అడ్వొకేట్ మాత్ర‌మే. బుర్ర ఉన్న అడ్వొకేట్ తో ప్ర‌తి మ‌నిషికి ఇప్పుడు ప‌ని ప‌డుతోంది. అధునాత‌న క్రైమ్ వ‌ర‌ల్డ్ లో ఇప్పుడు అడ్వొకేట్ల‌కు డిమాండ్ అమాంతం పెరిగింది.

అయితే వేల కోట్ల సామ్రాజ్యం ఉన్న కింగ్ ఖాన్ షారూఖ్ త‌న కొడుకు ఆర్య‌న్ ఖాన్ ని డ్ర‌గ్స్ కేసు నుంచి కాపాడుకునేందుకు ఎలాంటి సాహ‌సం చేసాడో తెలుసా?  కొడుకును అరెస్ట్ చేసి జైల్లో వేసారు అనేది తెలుసుకున్న కింగ్ ఖాన్ ఒక్క‌సారిగా కుప్ప‌కూలాడు. ఆర్య‌న్ ఖాన్ ని అరెస్ట్ చేసిన అధికారిని ఫోన్ లోనే బ‌తిమాలుకున్నాడు ఖాన్. కానీ అత‌డు లొంగ‌క‌పోయే స‌రికి, ఈ కేసులో ప్ర‌తి ఎవిడెన్స్ ని సంపాదించి పెట్టుకుని, స‌రైన లాయ‌ర్ కోసం వెతికాడు. అప్పుడు రంగంలోకి దిగాడు రోహిత్గి. సీనియ‌ర్ అడ్వొకేట్ ముకుల్ రోహిత్గి బ‌రిలో దిగేవర‌కూ షారూఖ్ ధైర్యంగా లేరు. ఆయ‌న లండ‌న్ నుంచి రాగానే, ఇక్క‌డ ఖాన్ కుదుట‌ప‌డ్డాడు.

అయితే కొడుకు కోసం లాయ‌ర్ ని షారూఖ్ ఎంత‌గా బ‌తిమాలాడో తెలుసా?  అప్ప‌టికే లండ‌న్ వెకేష‌న్ లో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్న లాయ‌ర్ తాను ఈ కేసు కోసం ఇండియాకు రాలేన‌ని మొండికేసాడు. కానీ షారూఖ్ వ‌దిలిపెట్ట‌లేదు. ఒక్క‌సారి మీ స‌తీమ‌ణితో మాట్లాడ‌తాను! అంటూ ఫోన్ లో మాట్లాడాడు. ఒక క్ల‌యింటుగా చూడ‌కండి.. ఒక తండ్రిగా క‌న్న కొడుకు ఆవేద‌న‌ను చూసే వ్య‌క్తి గురించి మీరు ఆలోచించండి! అని బ‌తిమాలాడు. ఆ త‌ర్వాత లాయ‌ర్ సతీమ‌ణి స్వ‌యంగా ఒప్పించి భ‌ర్త‌ను నేరుగా ముంబైకి పంపారు. ఆ స‌మ‌యంలో లండ‌న్ కి త‌న ప్ర‌యివేట్ జెట్ ని పంపించేందుకు కూడా షారూఖ్ సిద్ధ‌మ‌య్యారు. దీనికోసం కొన్ని కోట్లు ఖ‌ర్చు అయినా ఫ‌ర్వాలేద‌నుకున్నారు. కానీ లాయ‌ర్ దానికి అంగీక‌రించ‌లేదు. అత‌డు ముంబైకి ఏదోలా వ‌చ్చాడు. కొడుకు కోసం ఖాన్ త‌ప‌న నిజంగా లాయ‌ర్ ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. 

ఇప్పుడు ఓ ఇంట‌ర్వ్యూలో లాయ‌ర్ ముకుల్ రోహిత్గి బాద్ షా షారూఖ్ ఖాన్ ప‌ట్టుద‌ల‌ను ఆకాశానికెత్తేసారు. అత‌డు లండ‌న్ నుంచి ముంబైకి వ‌చ్చేప్ప‌టికి మొత్తం పేప‌ర్ వ‌ర్క్ పూర్తి చేయించాడు షారూఖ్. వాటిని త‌ను వ‌చ్చి స్ట‌డీ చేసాడు. స్ట‌డీ చేసేప్పుడు ఖాన్ త‌న‌తోనే ఉండిపోయాడు. దీనిని బ‌ట్టి షారూఖ్ ఎంత‌టి తెలివైన‌వాడో కూడా ముకుల్ రోహిత్గి అర్థం చేసుకున్నాడు. ఖాన్ తెలివి తేట‌ల గురించి ఆయ‌న ప్ర‌శంస‌లు కురిపించారు. ముకుల్ రోహిత్గి ప్ర‌భుత్వం త‌ర‌పున న్యాయ ప‌రిష్కారాల‌ను చూసే అడ్వొకేట్. సినీరాజ‌కీయ రంగాలు, పారిశ్రామిక రంగాల నుంచి దిగ్గ‌జాల‌కు న్యాయ‌వాదిగా ప‌ని చేసారు. భార‌త‌దేశంలోని లీడింగ్ అడ్వొకేట్ గా హైప్రొఫైల్ కేసుల‌ను డీల్ చేయ‌డంలో ఆయ‌న దిట్ట‌. క్రిమిన‌ల్ లాయ‌ర్, రాజ్యాంగంపై లాయ‌ర్, ప‌న్ను సంబంధిత స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే లాయ‌ర్, ఇంకా చాలా కోణాల‌లో అత‌డు ఇండియాలో ఫేమ‌స్.

Star hero ready to give 100 crores to lawyer:

Shah Rukh Khan pleaded with lawyer wife to get him to fight Aryan Khan case

Tags:   SHAH RUKH KHAN
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ