హనుమాన్, మిరాయ్ లాంటి బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా హిట్స్ తో తేజ సజ్జ ప్రస్తుతం క్రేజీ హీరోగా మారాడు. మిరాయ్ ప్రస్తుతం బాక్సాఫీసు ని దున్నేస్తుంది. మిరాయ్ వారం తిరగకుండానే మిరాయ్ 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టి ఔరా అనిపించింది. ఇక తర్వాత తేజ సజ్జ లైనప్ ఎలా ఉంటుంది అనే విషయంపై ఈ హీరో ఫుల్ క్లారిటీ ఇచ్చేసాడు.
తేజ సజ్జ తన నెక్స్ట్ మూవీస్ ని ప్రకటించాడు. అవి మూడూ కూడా సీక్వెల్స్ అవడం గమనార్హం. జాంబీరెడ్డి, హనుమాన్, మిరాయ్ ఈ మూడు చిత్రాల సీక్వెల్స్ చెయ్యబోతున్నట్టుగా తేజ సజ్జ ప్రకటించాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జాంబీ రెడ్డి, హనుమాన్ చిత్రాలు తెరకెక్కాయి. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే జాంబీ రెడ్డి 2, హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ వస్తాయి.
జై హనుమాన్ లో తేజ సజ్జ హీరో కాకపోయినా, ఆ సీక్వెల్ లో నటించాల్సి ఉంది. ఇక ఇప్పుడు మిరాయ్ సీక్వెల్ కోసం కార్తీక్ ఘట్టమనేని కొన్ని ఐడియాలు సిద్ధంగా ఉన్నట్లు గా మిరాయ్ ప్రమోషన్స్ లోనే ప్రకటించాడు. ప్రస్తుతం కొత్త దర్శకుడు కానీ, కొత్త నిర్మాత కానీ తేజ సజ్జ కోసం ట్రై చెయ్యడానికి కొన్నేళ్లు సమయం పట్టెయ్యడం గ్యారెంటీ.