సెప్టెంబర్ 5 న మంచి అంచనాల నడుమ తెలుగు, తమిళంలో విడుదలైన మురుగదాస్-శివకార్తికేయన్ ల మదరాసి చిత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యింది. మురుగదాస్ తన ప్లాప్ ల పరంపరను మదరాసి తోనూ కంటిన్యూ చేసారు. శివకార్తికేయన్ పెరఫార్మెన్స్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ కి నచ్చినా మిగతా ఏ విషయంలోనూ మదరాసి ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఇంకా థియేటర్స్ లోనే కొనసాగుతున్న మదరాసి ఓటీటీ డేట్ పై ఇప్పుడొక న్యూస్ వైరల్ గా మారింది. మదరాసి చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ డీల్ కు దక్కించుకుందని తెలుస్తుంది. మదరాసి చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ పై అమెజాన్ ప్రైమ్ ఓ డేట్ లాక్ చేసింది అని సమాచారం.
థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన మదరాసి ని అమెజాన్ ప్రైమ్ అక్టోబర్ 3 నుంచి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుందని తెలుస్తోంది. ఇంకా దీనిపై స్పష్టమైన ప్రకటన కూడా రావాల్సి ఉంది.