భార్య నటాషా స్టాంకోవిక్ నుంచి క్రికెటర్ హార్థిక్ పాండ్యా విడిపోయిన సంగతి తెలిసిందే. బ్రేకప్ సమయంలో అతడిపై రకరకాల రూమర్లు వినిపించాయి. హార్థిక్ దూకుడు తట్టుకోలేకే నటాషా అతడి నుంచి విడిపోయిందంటూ ఒక సెక్షన్ మీడియా విస్త్రతంగా ప్రచారం చేసింది. మగువలతో సరసంలో హార్థిక్ వ్యవహారాన్ని కొన్ని మీడియాలు నిశితంగా గమనించి ప్రశ్నించాయి. ఇక నటాషా నుంచి విడిపోయిన తర్వాత విదేశీ మోడల్, గాయని జాస్మిన్ వాలియాతో ఎఫైర్ సాగిస్తున్నాడంటూ ప్రచారం సాగింది.
సోషల్ మీడియాల్లో ఆ ఇద్దకూ ఒకరినొకరు అనుసరించడంతో దానిని రెడ్డిటర్లు పదే పదే ప్రశ్నించారు. పాండ్యా వ్యవహారాల్ని నిలదీసే ప్రయత్నం సాగింది. అయితే ఇటీవల పాండ్యా ఈ రిలేషన్ షిప్ నుంచి కూడా బయటపడ్డాడని, ఇద్దరికీ బ్రేకప్ అయిందని వార్తలు వెలువడటం ఆశ్చర్యపరిచింది.
తాజా సమాచారం మేరకు గాయని జాస్మిన్ వాలియా నుంచి విడిపోయిన ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా మోడల్ కం నటి మహీక శర్మతో డేటింగ్ లో ఉన్నాడంటూ ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరూ కూడా ఒకరినొకరు సోషల్ మీడియాలో అనుసరిస్తుండడంతో రెడ్డిటర్లు తమదైన శైలిలో చెలరేగుతున్నారు. ఇప్పటివరకూ ఎఫైర్ పుకార్లపై హార్థిక్ కానీ మహీక కానీ స్పందించలేదు. అవును అని కానీ, కాదని కానీ చెప్పలేదు. ప్రస్తుతానికి ఇవన్నీ రూమర్లు మాత్రమే. మహీక పాపులర్ మోడల్. పలు కార్పొరెట్ బ్రాండ్లకు ప్రచారకర్తగా కొనసాగుతోంది. సినిమాల్లోను నటిస్తూ బిజీగా ఉంది.