చీర కట్టు అయినా, లేదంటే మోడ్రెన్ డ్రెస్ అయినా దానిని అనసూయ కట్టింది అంటే అది ఆ డ్రెస్ కే, ఆ చీరకే అందం వస్తుంది. హైట్ కి హైట్, అందానికి అందం తో అనసూయ పర్సనాలిటికి ఏది కట్టినా బ్యూటిఫుల్ గానే ఉంటుంది. సినిమా షూటింగ్స్, షాప్ ఓపినింగ్స్ తో ఎప్పుడు బిజీగా వుండే అనసూయ ఫ్యామిలీ కి కూడా తగిన సమయాన్ని కేటాయిస్తుంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబందించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తుంది. తాజాగా అనసూయ నుంచి వచ్చిన ఫొటోస్ చూస్తే అనసూయ చీర ను ఇలా కూడా కట్టొచ్చా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. బ్లౌజ్ వేసి దానిపై చీర పల్లు వెయ్యడం అనేది చూస్తుంటాము.
కానీ అనసూయ చీర పల్లుని లోపల పెట్టి బ్లౌజ్ బయట పెట్టి కట్టి మరీ డిఫ్రెంట్ లుక్ లో కనిపించింది. అంతేకాదు అలాంటి చీర కట్టులో అనసూయ ఇచ్చిన ఫోజులు చూస్తే మతిపోవాల్సిందే. మీరు కూడా అనసూయ విభిన్న వస్త్రధారణ ఫొటోస్ పై ఓ లుక్కెయ్యండి.