మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజా సాబ్ సినిమా చెయ్యడం ప్రభాస్ ఫ్యాన్స్ కు అస్సలు ఇష్టం లేదు. పాన్ ఇండియా రేంజ్ ఉన్న ప్రభాస్ డిజాస్టర్ డైరెక్టర్ తో సినిమా ఒప్పుకోవడంపై ఫ్యాన్స్ నుంచి చాలా వ్యతిరేఖత కనిపించింది. కానీ రాజా సాబ్ ఫస్ట్ లుక్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కొద్దిగా కూల్ అయ్యారు. అటు దర్శకుడు మారుతి నన్ను కంగారు పెట్టొద్దు మీకు రాజా సాబ్ నుంచి బెస్ట్ అవుట్ ఫుట్ ఇస్తా అంటున్నారు.
తాజాగా మారుతి ఓ సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చాడు. ఆ సినిమా ఈవెంట్ లో మారుతి మాట్లాడుతూ సినిమాలు ఆడడం లేదు అని పిచ్చి పనులు చెయ్యకండి.. నేను డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాసేవాడిని, నాపై బూతు డైరెక్టర్ అనే పేరు పడింది. ఈ రోజుల్లో సినిమా దగ్గరనుంచి నేను ఇప్పుడు 400 కోట్ల సినిమా వరకు ఎదిగాను.
నేను ఇప్పటికి నిమిషాల ప్రకారం డబుల్ మీనింగ్ డైలాగ్స్ రాయగలను. ప్రభాస్ నన్ను నమ్మారు, నన్ను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో మీరే చూస్తారు అంటూ మారుతి రాజా సాబ్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కి మరోసారి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నిజమే మారుతి కాన్ఫిడెన్స్ చూసాక ప్రభాస్ ఫ్యాన్స్ లో అనుమానాలు పక్కనబెట్టి తగ్గాల్సిందే.