పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా షూటింగ్స్ చేసుకుంటున్నారు, డిప్యూటీ సీఎం అయ్యుండి ఆయన ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను పట్టించుకోకుండా సినిమా షూటింగ్స్ చేసుకుంటున్నారు అంటూ.. మాజీ ఎమ్యెల్యే మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యింది,
అయితే రోజా పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు జనసేన మంత్రి కందుల దుర్గేష్ కౌంటర్ ఇచ్చారు. ఆమె రాజీకీయాల్లో ఉండి జబర్దస్త్ లో పాల్గొనలేదా, జబర్దస్త్ లో డాన్స్ లు చేసిన రోజా మాట్లాడేందుకు అర్హత ఉందా, అసలు వైసీపీ హయాంలో పర్యాటక మంత్రిగా రోజా ఏం అభివృద్ధి చేశారని, పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత రోజాకు ఉంది.. ప్రజా సమస్యల పరిష్కారంలో పవన కళ్యాణ్ అలసత్వం వహించలేదు
మీకు కబ్జాలు దొంగ వ్యాపారాలు ఉన్నాయి.. పవన్ కళ్యాణ్ ప్రొఫెషన్ సినిమాలు, ఆయనకు సినిమాలు మాత్రమే ఉన్నాయి.. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయకుండా పవన్ కళ్యాణ్ ను ఎలా విమర్శిస్తారు అంటూ మంత్రి కందుల దుర్గేష్ రోజా ఫై ఫైర్ అయ్యారు.