తేనె కళ్లతో, మత్తెక్కించే నటప్రదర్శనతో మైమరిపించిన సీనియర్ నటి మోహినిని 90ల నాటి యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఆదిత్య 369 , హిట్లర్ సహా పలు తెలుగు చిత్రాల్లో నటించిన ఈ తేనె కళ్ల బ్యూటీ, తమిళంలోను అగ్ర హీరోల సరసన నటించింది. బాలకృష్ణ, చిరంజీవి, శివాజీ గణేషన్, మోహన్ లాల్ సహా దిగ్గజ హీరోల సరసన మోహిని నటించింది. ఈ బ్యూటీ దక్షిణాది అన్ని చిత్రసీమలకు సుపరిచితం.
అయితే మోహిని 2011 లో ఓ సినిమాలో నటించినా, ఆ తర్వాత తెరకు దూరమైంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మోహిని ఒకానొక సమయంలో తాను ఎదుర్కొన్న ఓ ఇబ్బంది గురించి ప్రస్థావించింది. ఇంతకుముందు సెల్వమణి దర్శకత్వం వహించిన కన్మణి చిత్రం కోసం తనకు ఇష్టం లేకపోయినా బికినీ ధరించాల్సి వచ్చిందని, సెట్లో అంతమంది ముందు అర్థనగ్నంగా కనిపించాల్సి వచ్చిందని తెలిపింది. తనకు ఇష్టం లేకపోయినా, సౌకర్యంగా లేదని విన్నవించినా అతడు వినలేదు. పదే పదే తనతో బికినీ సీన్స్, స్టీమీ సీన్స్ చేయించారని మోహిని ఆరోపించింది. కొన్నిసార్లు సినీపరిశ్రమలో ఆడవాళ్లు ఒత్తిళ్లకు లొంగాల్సి వస్తుందని మోహిని వెల్లడించారు. ఈ రంగంలో ఇష్టం ఉన్న పని చేయడం కుదరదని కూడా వ్యాఖ్యానించారు.
తనను బికినీ ధరించాలని ఒత్తిడి చేసినప్పుడు దానికి నేను అంగీకరించలేదు. రోజులో సగం అయిపోయినా షూటింగ్ ను ప్రారంభించలేదు. కానీ దర్శకుడు నాపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాడని నాటి ఘటనను గుర్తు చేసుకుంది మోహిని. చివరికి వారి ట్రాప్ లో పడిపోయి బికినీ ధరించాల్సి వచ్చిందని కూడా తెలిపింది. కన్మణి చిత్రం విడుదలై చాలా కాలమే అయింది. తాజా ఇంటర్వ్యూలో మోహిని నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.